డ్యామ్‌ల పటిష్టతపై దృష్టి పెట్టండి

డ్యామ్‌ల పటిష్టతపై దృష్టి పెట్టండి


అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

► డ్యామ్‌ల పనితీరుపై నిరంతరం సమీక్షించాలి

► భద్రతకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలి

► అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ
సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల డ్యామ్‌ల పటిష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికా రులను ఆదేశించారు. డ్యామ్‌ గేట్లు, వాటి పని తీరు, ఇతర అంశాలపై నిరంతరం తనిఖీ చేస్తూ, సమీక్షించాలని సూచించారు. మంగళవారం ’వాలంతరి’ సంస్థలో జరిగిన డ్యామ్‌ సేఫ్టీ సదస్సులో మంత్రి హరీశ్‌ ప్రసంగించారు.


డ్యాముల ఆపరేషన్‌ వ్యవహారాల్లో తగు పరి జ్ఞానం అవసరమని, ప్రతి డ్యామ్‌ దగ్గర లైన్‌ డయాగ్రం ఉండాలని ఇంజనీర్లకు సూచిం చారు. 2009 వరదలప్పుడు ఇరిగేషన్‌ ఇంజనీర్లు ప్రతిభ చూపి డ్యాములను రక్షించారని, అలాంటి అనుభవాలను ఆచరించాలన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, జూరాల వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల డ్యామ్‌ భద్రతా వ్యవహారాల బాధ్యతలను ఎస్‌ఈలు మీడియం, మైనర్‌ ప్రాజెక్టు వ్యవహారాలను ఈఈలు చూడాలని ఆదేశించారు.యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలి: వర్షాకాలానికి ముందు, వర్షాకాలం అనంతరం చేపట్టవలసిన చర్యలపై యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుని అమలు చేయాలని హరీశ్‌ సూచించారు. ప్లాన్‌ అమలుకు నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం 10 మేజర్, 39 మీడియం, 132 మైనర్‌ డ్యామ్‌లు రాష్ట్రంలో ఉన్నాయని, డ్యామ్‌ల అభివృద్ధి కోసం కేంద్రం డీఆర్‌ఐపీని ప్రకటించిందని వెల్లడించారు.


డ్యాముల పటిష్టతకు చర్యలు చేపట్టేందుకు అంచనాలను సిద్ధం చేసి పంపాలని రాష్ట్రాలను కేంద్రం కోరిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇందుకుగానూ ఈఎన్‌సీ, ’కాడా’ కమిషనర్, సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ సీఈ, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సీఈలు సమన్వయంతో అంచనాలు తయారు చేయాలని చెప్పారు. డ్యామ్‌ల రక్షణ కోసం అంతర్జాతీయ అనుభవాలు అనుసరించాలని, గేట్లు, గ్రీసింగ్‌ పనులను, మరమ్మతులను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ప్రమాదాలు రాకముందే వాటిని నిరోధించడానికి చర్యలవసరమని, ఇందుకు రిటైర్డు అధికారుల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు.39 ప్రాజెక్టులకు ‘క్యాడ్‌వాం’ నిధులు

రాష్ట్రంలోని 39 సాగునీటి ప్రాజెక్టు లకు క్యాడ్‌వాం కింద కేంద్రం నిధులు ఇవ్వ నుంది. ఏఐ బీపీ పరిధిలోని 11 ఆన్‌ గోయింగ్‌ ప్రాజె క్టులకు క్యాడ్‌వాం కింద రూ.1,928 కోట్లు మంజూరయ్యాయని, అందులో నిబంధ నల ప్రకారం వివిధ కాంపోనెంట్ల కింద కేంద్రం 50% భరించనుందని, ఆ నిధుల మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ కోసం ప్రతిపాద నలు తయారు చేసి పంపాలని మంత్రి  అధికారులను ఆదేశించారు.ఇక ఇదివరకే పూర్తయిన ప్రాజెక్టుల్లో 28 ప్రాజెక్టులు క్వాడ్‌వాం నిధులు విడుదలయ్యే జాబితా లోకి చేరాయని, ఈ జాబితాలో ఉన్న ప్రాజెక్టుల్లో చేపట్టనున్న పనులకు సంబంధించిన డీపీఆర్‌లను వెంటనే కేంద్రానికి పంపించాలని సూచించారు.మిడ్‌మానేరు పనులు వేగిరం చేయండి

అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: సిరిసిల్ల రాజన్న జిల్లాలోని మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశిం చారు. మంగళవారం మిడ్‌మానేరు తదితర ప్రాజెక్టుల పురోగతిని ’వాలంతరి’లో సమీ క్షించారు. మిడ్‌మానేరుకు చెందిన ఆర్‌ అండ్‌ ఆర్‌ సమస్యలని వెంటనే పరిష్కరిం చాలని సమావేశంలో పాల్గొన్న జిల్లా కలె క్టర్, జాయింట్‌ కలెక్టర్, ఇతర అధికారు లను ఆదేశించారు.


భూ నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, ఇతర అంశాలను గ్రామాల వారీ గా మంత్రి సమీక్షించారు. అలాగే ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలలో మౌలిక సదుపాయా ల కల్పనకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులను సత్వరం చేయాలన్నారు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని, జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లా పాలెం వాగు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top