కిరాణాషాపు దగ్ధం: రూ.3 లక్షలు నష్టం | Fire accident due to Short circuit | Sakshi
Sakshi News home page

కిరాణాషాపు దగ్ధం: రూ.3 లక్షలు నష్టం

Aug 24 2015 6:27 PM | Updated on Oct 16 2018 3:12 PM

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఓ కిరాణా షాపు దగ్ధమై రూ.3 లక్షల నష్టం సంభవించిన ఘటన మండల పరిధిలోని పాతూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

మెదక్ రూరల్ : విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఓ కిరాణా షాపు దగ్ధమై రూ.3 లక్షల నష్టం సంభవించిన ఘటన మండల పరిధిలోని పాతూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... పాతూరు గ్రామానికి చెందిన పొగాకు అశోక్ గత కొంతకాలంగా గ్రామంలో కిరాణా షాపును నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా సోమవారం వేకువజామున ఒక్కసారిగా షాపులో మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబంది వచ్చి మంటలను ఆర్పినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఫ్రిడ్జ్, కూలర్‌తోపాటు నగదు, రూ. 5వేలు సైతం కాలి బూడిదైనట్లు బాధితుడు అశోక్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని వాపోయాడు. తనను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement