
అయ్యోపాపం.. ఆటోలో ఆడ శిశువు
మనలను కనిపెంచేందుకు తల్లి కావాలి.. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి కావాలి..
వారి సమాచారంతో స్పందించిన ఐసీడీఎస్ మండల సూపర్‌వైజర్ బత్తిని కళ్యాణి స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలకు సమాచారమిచ్చారు. వెంటనే అంగన్‌వాడీలు పద్మారాణి, ఝాన్సీ, సరిత, సారాబాయి, ఊర్మిళ అక్కడికి వెళ్లి పాపను తీసుకున్నారు. మట్టి కొట్టుకుపోయిన పాపను తమ పిల్లలా భావించి శుభ్రంగా స్నానం చేయించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి పాప ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుపగా, ఆమె ఏడుపులకు చలించిన అక్కడే ఉన్న మరో తల్లి తన చనుబాలను ఆ పాపకు అందించింది. అనంతరం పాపను 108 ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలు వరంగల్‌లోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు.