చీరకట్టు కేవలం అలంకారం కోసమే కాదు.. | Fashion Designer Sabyasachi About Indian Culture And Indian Saree | Sakshi
Sakshi News home page

చీరకట్టులో అతివల ఆత్మగౌరవం

Jun 16 2020 10:35 AM | Updated on Jun 16 2020 10:35 AM

Fashion Designer Sabyasachi About Indian Culture And Indian Saree - Sakshi

జూబ్లీహిల్స్‌: భారతీయ మహిళల చీరకట్టు కేవలం అలంకారం కోసమే కాదు. వారి ఆత్మగౌరవం పెంచడంలో, చక్కటి స్ఫూర్తిని ఇవ్వడంతో పాటు ఒక విలక్షణ ఉనికిని చాటుతాయని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ అన్నారు. ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో సోమవారం “ద ఫ్యూచర్‌ ఆఫ్‌ లగ్జరీ అండ్‌ ద మేకిన్‌ ఇండియా’ పేరుతో నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన డిజైన్‌ ఎంతో సరళంగా ఉంటుందన్నారు. దుస్తులు మనిషి మేధకు పొడిగింపులాంటిదన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఓ మాజీ జాతీయ అధ్యక్షురాలు పింకీరెడ్డి, ఎఫ్‌ఎల్‌ఓ చాప్టర్‌ అధ్యక్షురాలు సుధారాణి సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఓగ్‌ ఇండియా మేగజైన్‌ ఎడిటర్‌ ప్రియాతన్నా సంధానకర్తగా వ్యవహరించారు.

ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచితో వెబ్‌నార్‌ దృశ్యం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement