రాష్ట్ర రైతులు పాలీ హౌస్‌లు నిర్మించుకుంటే తాము సహకరిస్తామని ఉద్యానవన కమిషనర్ వెంకట రామిరెడ్డి అన్నారు.
నల్లగొండ(భువనగిరి అర్బన్): రాష్ట్ర రైతులు పాలీ హౌస్‌లు నిర్మించుకుంటే తాము సహకరిస్తామని ఉద్యానవన కమిషనర్ వెంకట రామిరెడ్డి అన్నారు. ఆయన నల్లగొండ జిల్లా భువనగిరిలో కొత్తగా ఏర్పాటు చేసిన పాలీ హౌస్‌ను ప్రారంభించారు. భువనగిరికి చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు తన పొలంలో పాలీ హౌస్‌ను నిర్మించి క్యాప్సికం సాగు చేస్తున్నారు. అయితే ఈ రోజు పంటను కమిషనర్ పరిశీలించారు. 200 గజాల నుంచి 1000 గజాలలోపు స్థలంలో పాలీహౌస్‌లు నిర్మించుకుని లాభాలు పొందాలని రైతులకు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
