తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం | farmer commit suicide at MRO office | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

Mar 14 2017 5:51 PM | Updated on Oct 1 2018 2:44 PM

బోరును సీజ్‌ చేస్తామని అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అనంతగిరి (కోదాడ): బోరును సీజ్‌ చేస్తామని అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘట న అనంతగిరిలో సోమవారం చోటు చేసుకుంది. మం డల పరిధిలోని గోండ్రియాలకు చెందిన రైతు నెల్లూరి రాజేంద్రప్రసాద్‌ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  బోరు విషయంలో పక్కపక్క పొలాలకు చెందిన రైతులు గొడవ పడి అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో తన బోరును సీజ్‌ చెయ్యకుండా రాజేంద్ర ప్రసాద్‌ స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అధికారులు రోజు వచ్చి తన బోరును సీజ్‌ చేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ క్రమంలో సోమవారం కార్యాలయానికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్‌ తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. చట్టప్రకారం వ్యవరిస్తామని తహసీల్దార్‌ స్పష్టం చేయడంతో ఆయన  వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగారు. వెంటనే అధికారులు ఆయనను కోదాడకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. దీనిపై తహసీల్దార్‌ అనంతగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement