నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలతో వాహనాల విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను వరంగల్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
వరంగల్ : నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలతో వాహనాల విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను వరంగల్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు కార్లు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 35 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ జిల్లా ములుగు మండలం భూపాల్‌నగర్‌కు చెందిన సుధీర్‌రెడ్డి, ఇదే జిల్లా పుప్పాలగుట్టకు చెందిన సాధిక్, మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన రాజేశ్‌రెడ్డి, ఖమ్మం జిల్లా పాపటపల్లికి చెందిన నవీన్ ఉన్నారు.