ఆలయ సమీపంలో తవ్వకాల కలకలం | Excavations in the vicinity of the temple caused outrage | Sakshi
Sakshi News home page

ఆలయ సమీపంలో తవ్వకాల కలకలం

Jul 31 2015 3:39 AM | Updated on Sep 26 2018 5:59 PM

మండలంలోని లింగన్నపేట-ఏదుల బంధం ప్రధాన రహదారి మార్గంలో అడవిలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో

కోటపల్లి : మండలంలోని లింగన్నపేట-ఏదుల బంధం ప్రధాన రహదారి మార్గంలో అడవిలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలకు పాల్పడ్డారు. వారం క్రితం ఈ ఘటన జరగినట్లు తెలుస్తుండగా తాజాగా వెలుగు చూసింది. గుప్త నిధు లు ఉన్నాయనే భావనతో సరిహద్దు మహారాష్ట్రకు  చెందిన వ్యక్తులు రాత్రి సమయంలో ఇక్క డ తవ్వకాలు జరిపినట్లు సమీప గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. క్షుద్రపూజలు చేసి టెం కాయలు కొట్టిన ఆనవాళ్లు ఉండడంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ సమీపంలో రెండు గుంతలు ఉండగా, దుండగులకు సమీప గ్రామానికి చెందిన కొందరు సహకరించి ఉంటారని గ్రామాల్లో ప్రచారం సాగుతోంది. కాగా ఈ విషయమై సమీప లింగన్నపేట అటవీ బీట్ అధికారి జాలీంషాను వివరణ కోరగా ఆలయ సమీపంలో గుంతలు ఉన్నాయన్న సమాచారం వాచ ర్ ద్వారా అందిందని తెలిపారు. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement