గతపాలకుల నిర్లక్ష్యం వల్లే వెనుకబాటు

గతపాలకుల నిర్లక్ష్యం వల్లే వెనుకబాటు


మహబూబ్‌నగర్ రూరల్: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని పార్లమెంటరీ కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మం డల పరిధిలోని దివిటిపల్లి గ్రామంలో బడి పిల్లలకు సన్నబియ్యం భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శినితో కలిసి ప్రారంభించారు.



ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో చిన్న చిన్న లోటుపాట్లను సవరించి ప్రజలు పారదర్శకమైన సేవలందిస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నదన్నారు. రైతు, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 60వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.



దివిటిపల్లి గ్రామంలో మౌలిక సదుపాయా కల్పనకు కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డుల ద్వారా లబ్దిదారులకు 6 కేజీల చొప్పున బియ్యం అందజేస్తున్నదన్నారు. అంగన్‌వాడీల్లో గర్బిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వపరంగా లబ్దిపొందేందుకు లబ్దిదారులు దరఖాస్తులు చేసుకుంటే పరిశీ లించి అర్హులకు అవకాశం కల్పిస్తామన్నారు.



గ్రామాల్లో మౌలిక వసతుల కోసం అవసరమైన ప్రతిపాదనలు పం పాలని అధికారులకు సూచించారు. అ నంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ హన్మంతురెడ్డి, తహిసీల్దార్ అమరేందర్, ఎంఈఓ వెంకట్రాముడు, సర్పంచ్ పాం డురంగారెడ్డి, విద్యార్థులు  పాల్గొన్నారు.



నేడు పాలమూరు భారీ ర్యాలీ

ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శనివారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్‌గౌడ్, సింగిల్‌విండోచైర్మన్ వెంకటయ్య, ఆనంద్‌గౌడ్, ఇంతియాజ్, చందర్‌పాటిల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెట్టుగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ న్యూటౌన్, బస్టాండ్, వన్‌టౌన్,గడియారం చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు కొనసాగుతుందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top