తండ్రికి తలకొరివి పెట్టిన తనయ | doughter doing the father crimiation | Sakshi
Sakshi News home page

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

Nov 25 2015 1:16 AM | Updated on Sep 3 2017 12:57 PM

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మంగళవారం పాలమాకులలో చోటు చేసుకుంది.

 నంగునూరు: అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మంగళవారం పాలమాకులలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుండెళ్లి చంద్రయ్య (50) నిరుపేద కావడంతో బతుకుదెరువు కోసం కరీంనగర్‌కు వెళ్లి హమాలి పనులు చేసేవాడు. అనారోగ్యానికి గురైన చంద్రయ్య రెండు నెలల కిందట స్వగ్రామానికి వచ్చి భార్య కిష్టవ్వతో కలసి కూలి పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో చంద్రయ్య సోమవారం రాత్రి మృతి చెందాడు. అతనికి కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు కృష్ణవేణి తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. కాగా నిరుపేదలైన వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement