డీఎంహెచ్‌ఓ అన్నప్రసన్నకుమారి బదిలీ

The DMHO AnnaPrasana Kumari Has Been TransFerred - Sakshi

జనగామ : జనగామ జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్నకుమారిని పదోన్నతిపై బదిలీ చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. 2017 మేలో జిల్లా వైద్యాధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రులను చక్కదిద్దడమే కాకండా.. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న ప్రైవేట్‌ క్లినిక్, నర్సింగ్‌ హోం, స్కానింగ్‌ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు.

జిల్లా కేంద్రంలోని పలు స్కానింగ్‌ కేంద్రాలు, క్లినిక్, ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడమే కాకుండా, కేసులు కూడా నమోదు చేశారు. గుట్టుచప్పడు కాకుండా చేస్తున్న అబార్షన్లపై కన్నెర్రజేశారు. ప్రజలను అమాయకులను చేసి, అడ్డదారిలో వైద్యం చేసే ఎంతటి వారినైనా వదిలి పెట్టలేదు.

రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా ఆస్పత్రులను సీజ్‌ చేశారు. సుమారు 14 నెలల జనగామలో పని చేసిన అన్న ప్రసన్నకుమారి రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ అడిషినల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్నారు. జిల్లాలో పని చేసినంత కాలం వైద్య సేవల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. నేడు విధుల్లో చేరాలని కమిషనర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

జనగామ జిల్లా వైద్యాధికారిగా మహేందర్‌

జనగామ జిల్లా వైద్యాధికారిగా ఎ.మహేందర్‌ను నియమిస్తూ వైద్యారోగ్య కమిషనర్‌ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం స్టేట్‌ ఎంసీహెచ్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేసిన మహేందర్‌ పదోన్నతిపై హైదరాబాద్‌కు వెళ్లారు. ప్రస్తుత డీఎంహెచ్‌ఓ పదోన్నతిపై బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో మహేందర్‌ను నియమించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top