నల్లగొండ జిల్లాలో సూర్యాపేట పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
పూలే విగ్రహం ధ్వంసం: నిరసనలు
Nov 28 2015 11:46 AM | Updated on Sep 3 2017 1:10 PM
హాల్య: నల్లగొండ జిల్లాలో సూర్యాపేట పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అందుకు నిరసనగా హాల్య పట్టణంలోని ప్రధాన సెంటర్ వద్ద బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలు శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Advertisement
Advertisement