'తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వం' | Devi Prasad takes on Andhra Pradesh employees in Telangana region | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వం'

Apr 26 2014 1:14 PM | Updated on Jul 12 2019 6:01 PM

'తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వం' - Sakshi

'తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వం'

తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వబోమని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ స్పష్టం చేశారు.

తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వబోమని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం వరంగల్ వచ్చిన దేవీ ప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకు ఉద్యోగుల్ని విభజించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం సత్వరం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అలా కానీ పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉదమాలను తలదన్నే మరో ఉద్యమాన్ని ప్రారంభించవలసి వస్తుందని దేవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement