కళాశాలకు వెళ్తున్నానని చెప్పి.. | Degree student missing | Sakshi
Sakshi News home page

కళాశాలకు వెళ్తున్నానని చెప్పి..

Jul 2 2016 8:06 PM | Updated on Sep 4 2017 3:59 AM

కళాశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించకుండాపోయిన సంఘటన శనివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

బోడుప్పల్ (హైదరాబాద్) : కళాశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించకుండాపోయిన సంఘటన శనివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ గాంధీనగర్‌లో నివసించే పి.రాబర్ట్ కుమార్తె కావేరి(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. గత నెల 28వ తేదీన కాలేజికి వెళుతున్నానని చెప్పి వెళ్లింది. మరలా తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement