ప్రాణం తీసిన రాంగ్‌కాల్స్ | Degree girl student commits suicide not to bare of Rangcalls | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన రాంగ్‌కాల్స్

Feb 27 2015 11:29 PM | Updated on Aug 20 2018 5:12 PM

పోకిరీల వేధింపులు భరించలేక ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

మెదక్ (పాపన్నపేట): పోకిరీల వేధింపులు భరించలేక ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ విఠల్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మెట్టు నారాయణ రెండో కుమార్తె మెదక్‌లోని శ్రీనివాస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది.

రెండు నెలలుగా ఆమె సెల్‌కు రాంగ్‌కాల్స్ వస్తున్నాయి. సిమ్ మార్చినా వాటి బెడద తగ్గలేదు. దీంతో కలత చెందిన రాధిక.. గురువారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి బాసటగా నిలుస్తుందనుకున్న కుమార్తె ఇలా అర్ధంతరంగా తనువు చాలిస్తుందనుకోలేదని తల్లిదండ్రులు విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement