నేటి నుంచి డీఈఈసెట్‌ దరఖాస్తులు  | DEECET Apllications Accepted From Today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి డీఈఈసెట్‌ దరఖాస్తులు 

Apr 21 2018 1:24 AM | Updated on Apr 21 2018 1:24 AM

DEECET Apllications Accepted From Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఈఈసెట్‌ కన్వీనర్‌ రమణకుమార్‌ తెలిపారు. వచ్చే నెల 10 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల లింకు శనివారం ఉదయం నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. గత ఏడాది పరీక్ష ఫీజు రూ. 350 ఉండగా, ఈసారి జీఎస్‌టీ కలుపుకొని రూ. 413గా కమిటీ నిర్ణయించింది.

Advertisement
 
Advertisement
Advertisement