అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | debt crisiss kills farmer | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Apr 15 2015 10:30 AM | Updated on Nov 6 2018 7:56 PM

పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

కరీంనగర్: పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. అకాలవర్షానికి పంట నష్టంతో పాటు అప్పులబాధ ఎక్కువ కావడంతో ఆకుల శ్రీనివాస్(43) అనే రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

గమనించిన కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement