కూతురును స్తంభానికి కట్టేసి కొట్టాడు | daughter tied and beats by father | Sakshi
Sakshi News home page

కూతురును స్తంభానికి కట్టేసి కొట్టాడు

May 27 2015 9:55 PM | Updated on Sep 3 2017 2:47 AM

కూతురును స్తంభానికి కట్టేసి కొట్టాడు

కూతురును స్తంభానికి కట్టేసి కొట్టాడు

కాపురానికి వెళ్లడం లేదని ఓ తండ్రి కూతుర్ని స్తంభానికి కట్టేసి కొట్టిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

కూసుమంచి(ఖమ్మం జిల్లా): కాపురానికి వెళ్లడం లేదని ఓ తండ్రి కూతుర్ని స్తంభానికి కట్టేసి కొట్టిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లి పిచ్చయ్య తన రెండో కుమార్తె నవ్యను వరంగల్ జిల్లా, డోర్నకల్ మండలం, తొడేళ్లగూడెం గ్రామానికి చెందిన పిట్టల నాగారాజుకు ఇచ్చి 2014 జూన్‌లో వివాహం చేశాడు. కొద్ది రోజుల పాటు వీరి కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత తనకు కాపురం నచ్చలేదంటూ నవ్య పుట్టింటికి వచ్చేసింది.

తల్లి మరణించటంతో తండ్రి పిచ్చయ్య, తమ్ముడుతో కలిసి ఉంటూ కూలీ పనులకు వెళ్తోంది. కుమార్తెను కాపురానికి పంపేందుకు పిచ్చయ్య పలు ప్రయత్నాలు చేశాడు. అయినా, కాపురానికి వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో బుధవారం ఉదయం చున్నీతో ఇంట్లో స్తంబానికి కట్టేసి చితకబాదాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. నవ్య కేకలు విన్న ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి విడిపించారు. తండ్రిపై కేసు నమోదు చేశారు. తండ్రి చేతిలో దెబ్బలు తిన్న నవ్యను మేనమామలు తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement