కుండపోత.. గుండెకోత

Crops damaged With heavy Rains in Karimnagar - Sakshi

 జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు

వేలాది ఎకరాల్లో నేలవాలిన వరి.. పత్తి పంటకు నష్టం

ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో ళ్లలోకి చేరిన వరద

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌) :  మండలంలోని కందుగుల గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నేదురు చంద్రమౌళి. ఇతనికి మూడున్నర ఎకరాల భూమి ఉంది. అందులో వరి పంట సాగు చేశాడు. ఇప్పటికే సుమారుగా ఎకరాకు రూ.25 వేల చొప్పున ఖర్చు చేశాడు. ఖరీఫ్‌ సీజన్‌లో ఆఖరికి కాలం కావడంతో తీవ్ర కష్టాలకోర్చి సాగు చేశాడు. మరో రెండు రోజుల్లో వరి కోసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. శుక్ర, శనివారం కురిసిన వర్షంతో వరి మొత్తం నేలవాలింది. కోయరాకుండా పొలం అంతా నీటితో నిండింది.’ ఇది ఒక్క చంద్రమౌళి పరిస్థితి కాదు జిల్లాలోని రైతులందరూ వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు.  

మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలు అన్నదాతకు గుండెకోత మిగను మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి అన్నదాత కుదేలవుతున్నాడు. ఆరుగాలం శ్రమించి సాగుచేసి పంట చేతికొచ్చేవేల నేలపాలు కావడంతో దిక్కుతోచరి స్థితిలో పడ్డారు. మూడేళ్లుగా వరుణుడు తమను పగబడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

13 మండలాల్లో అత్యధిక వర్షపాతం... 
ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో వర్షాలు కురువక పంటల సాగు ఆలస్యమైంది. సీజన్‌ ముగింపుదశలో కురుస్తున్న అకాల వర్షాలతో చెరువులు, కుంటలన్ని నిండి జలకళను సంతరించకున్నాయి. ఈ నెలలో తొమ్మిది రోజుల్లో రికార్డుస్ధాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని రామడుగు, శంకరపట్నం, మానకొండూరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 13 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం. శనివారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు నీటమునిగాయి. ప్రధానంగా శంకరపట్నం, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వరిపంటకు ఎక్కువగా నష్టం జరిగింది. సైదాపూర్‌ మండలంలో అత్యధికంగా 103.2మి.మీ, జమ్మికుంటలో 80.2, వీణవంకలో 70.2, చిగురుమామిడిలో 65.6మి.మీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 45.5 మిమీటర్ల వర్షపాతం నమోదైంది.  


జమ్మికుంట మండలంలో వాలిన పొలాన్ని చూపుతున్న రైతులు 

4,627 హెక్టార్లలో వరి పంట నష్టం..  
జిల్లాలో వరి సాగు సాధారణ విస్తీర్ణం 52 వేల హెక్టార్లు కాగా, ఈ ఖరీఫ్‌లో 79,327 హెక్టార్లు సాగైంది. 4.25 లక్షల టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 119 గ్రామాల్లో 6,298 రైతులకు చెందిన 4,627 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాలు దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతాయని రైతులు పేర్కొంటున్నారు. దెబ్బతిన్న పంటలను ఆదివారం ఏవోలు, ఏఈవోలు గ్రామాలవారీగా సర్వే చేసి వివరాలను సేకరిస్తున్నారు.   

దూది రైతుకు దుఃఖం..  
పత్తి రైతుకు మళ్లీ కష్టమొచ్చింది. అవసరం లేని సమయంలో కురుస్తున్న వర్షం తీరని నష్టాల్ని మిగిలిస్తుంది.  ప్రస్తుతం పత్తి పంట కాయ దశకు రాగా, కొన్ని ఏరియాల్లో మొదటి సారి ఏరుతున్నారు. ఎకరాలకు కనీసం పది క్వింటా ళ్లు రావాల్సిన దిగుబడి పంట కీలక సమ యం లో అకాల వర్షాలతో నష్టం వాటిల్లి ఆశించిన మేరకు దిగుబడి రాకపోగా, పెట్టుబడి వచ్చే పరిస్థితులు లేవని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పత్తి సాధారణ విసీ ్తర్ణం 42,918 హెక్టార్లు కాగా, ఈసారి 36,762 హెక్టార్లు సాగైంది. హెక్టారుకు కనీసం 14 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని ప్రాథమిక అంచ నా వేశారు అధికారులు. అయితే అకాల వర్షాలతో ఆశించిన మేరకు దిగుబడి వచ్చే పరి స్థితి కనిపించడం లేదు. వానలతో పత్తి కాయ నల్లబడగా, పలిగే దశలో ఉన్న కాయ మురిగిపోయే పరిస్థితి ఉందని రైతులు పేర్కొంటున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top