బావిలో క్రేన్ పడి ఒకరి దుర్మరణం | Crane fell on well one person died and three of injuries | Sakshi
Sakshi News home page

బావిలో క్రేన్ పడి ఒకరి దుర్మరణం

Apr 12 2015 1:36 AM | Updated on Sep 3 2017 12:10 AM

మట్టి తోడుతున్న క్రేన్ బావిలోపడడంతో ఓ వ్యక్తి మృతిచెందగా వురో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన వుండలంలోని భాంజీపేట శివారులోని బోజ్యానాయుక్‌తండాలో శనివారం జరిగింది.

మరో వుుగ్గురికి తీవ్ర గాయాలు
 
నర్సంపేట : మట్టి తోడుతున్న క్రేన్ బావిలోపడడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన వుండలంలోని భాంజీపేట శివారులోని బోజ్యానాయుక్‌తండాలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.... బోజ్యానాయుక్‌తండాకు చెందిన నూనావత్ స్వామికి చెందిన వ్యవసాయు బావిలో పూడిక తీత పనులు చేయుడానికి అజ్మీరా చందు(37)తోపాటు వురో 8వుంది కూలీలుఉదయంపనికి వెళ్లారు. వుధ్యాహ్న సవుయుంలో అన్నం తినడానికి బావిలో నుంచి పైకి ఎక్కా రు. భోజనం చేసిన అనంతరం సదరు కూలీలంతా వుళ్లీ బావిలోకి దిగారు.

బావిలోపనులు చేస్తూ పెద్దపెద్ద రాళ్లను క్రేన్ డబ్బాలో వేశారు. క్రేన్‌తో డబ్బాను బావి నుంచి పైకి లాగుతుండగా ఒక్కసారిగా క్రేన్ మొత్తం ఊడిపోరుు బావిలో పడిపోరుుంది. బావిలో పని చేస్తున్న చందు అక్కడికక్కడే మృతిచెందగా అందులో ఉన్న కూలీలు నూనావత్ రావుులు,బానోతులింగ,అజ్మీర రాజుకు తీవ్ర గాయూలయ్యూరుు. బావిపై ఉన్న వారు, చుట్టుపక్కల వారు 108కు సమాచారమిచ్చి వారిని  నర్సంపేటలోని ఏరియూ ఆస్పత్రికి తరలించారు. చందు మృతితో కుటుంబ సభ్యులు రోదించిన తీరు ప్రజలను కన్నీరు పెట్టించింది. ఈ ఘటనతో తండాలో విషాద ఛాయులు అలువుుకున్నారుు. మృతుడికి భార్య కవుల, ఇద్దరు కువూరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement