ప్రాణహిత ఆపేందుకు ప్రభుత్వ కుట్ర

CPI ML New Democracy Demands Pranahita Project - Sakshi

సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు 

నెన్నెల(బెల్లంపల్లి): ప్రాణహితపై ప్రాజెక్టు కట్టకుండా కాళేశ్వరంకు నీటిని పంపించి ఇతర జిల్లాలకు తాగునీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ మంచిర్యాల జిల్లా కమిటీ నాయకులు ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొమురంభీం, మంచిర్యాల జిల్లాలను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ప్రాణహితపై ప్రాజెక్టు కట్టి మంచిర్యాల జిల్లాకు నీరు అందిస్తానని ప్రకటించిన ప్రభుత్వం 50 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును యుద్దప్రాతిపదికపై కట్టి ఇప్పుడు పద్ధతి మార్చారని విమర్శించారు. ప్రాణహితపై ప్రాజెక్టు కట్టకపోవడం ఈ రెండు జిల్లాల రైతులకు తీవ్రంగా నష్టపర్చడమేనన్నారు. తక్షణమే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు ఎండి చాంద్‌పాషా, శ్రీనివాస్, లాల్‌కుమార్, బ్రాహ్మనందం, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు రత్నం తిరుపతి పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top