మందు.. మత్తు

Couple Drinking Alchohol On Abids Road hyderabad - Sakshi

సాక్షి, సిటీ బ్యూరో(హైదరాబాద్‌) : బయట సన్నగా వర్షం పడుతోంది. భాగ్యనగర వాసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే అబిడ్స్‌ రోడ్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఎక్సెంజ్‌ వద్ద రోడ్డు పక్కనే ‘సాక్షి’ కెమెరాకు చిక్కిందో వింత దృశ్యం. ఓ యువతి, యువకుడు శుక్రవారం మద్యం తాగుతూ, గంజాయి పీలుస్తున్న సన్నివేశం కెమెరా కంటపడింది. ఎవరేమనుకుంటే తమకేంటి అన్నట్టుగా వారిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ‘చుక్కే’శారు. మూసి ఉన్న దుకాణం ముందు తాపీగా కూర్చుకుని మందు మజాతో విందు చేసుకున్నారు.

మత్తు సరిపోలేదో, కిక్‌ ఇంకా కావాలనుకున్నారో తెలియదు కానీ మద్యానికి గంజాయి, సిగరెట్‌ జత చేసుకున్నారు. లోకమంతా మరిచి మత్తులో మునిగి తేలారు. పబ్లిగ్గా మందేస్తున్న చుక్క, చక్కనోడిని చూసి ఆ దారిన పోయే వారంతా చకితులై నోళ్లు వెళ్లబెట్టారు. ఇదేం చోద్యమంటూ గుసగుసలాడారు. గ‘మ్మత్తు’ అంటే ఇదేనేమో!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top