రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి | The couple died in raod accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

Feb 26 2018 2:21 PM | Updated on Jul 10 2019 7:55 PM

The couple  died in raod accident - Sakshi

ప్రమాదంలో మృతిచెందిన దంపతులు

రేగొండ(భూపాలపల్లి): ప్రమాదవశాత్తు బైక్‌ చెట్టుకు ఢీకొని దంపతులు మృతి చెందిన సంఘటన రేగొండ శివారులోని జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని సుల్తాన్‌పురం శివారు వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన చిరిపోతుల రవి, అరుణ దంపతులు చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి వివాహానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో సుల్తాన్‌పురం శివారులోని కోళ్లఫారం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. దీంతో రవి, అరుణ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులకు కొడుకు, కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు ప్రమాదంలో మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మిగిలారు

Advertisement
 
Advertisement
Advertisement