కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి జయంతి వేడుకలు

Congress Leaders Tribute To Jaipal Reddy In hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత సూదిని జైపాల్‌ రెడ్డి 78వ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. నెక్లెస్‌ రోడ్డులోని జైపాల్‌ రెడ్డి మెమోరియల్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు, వీ హెచ్‌ హనుమంతులు, రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లు రవి,తదితరులు హాజరయ్యారు.

అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన జైపాల్‌రెడ్డి తమ మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రభుత్వం జైపాల్‌ రెడ్డి పేరును పెట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే నెక్లెస్‌ రోడ్‌లో మెమోరియల్‌ హాల్‌ను నిర్మించాలన్నారు. అదేవిధంగా సీపీఐ అధ్యక్షుడు చాడ వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డికి నివాళులు అర్పించారు. కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తి జైపాల్‌రెడ్డి అని, హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందంటే అది జైపాల్‌ చొరవేనని ఆయన పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top