రామగుండంలో కేసీఆర్‌ పర్యటన

 cm kcr visits ramagundam NTPC - Sakshi

సాక్షి, రామగుండం:  ప్రాజెక్టుల పరిశీలనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఉదయం రామగుండం ఎన్టీపీసీలో పర్యటించారు. గురువారం రాత్రి ఎన్టీపీసీలో బస చేసిన కేసీఆర్‌ శుక్రవారం ఎన్టీపీసీలో నిర్మాణంలో ఉన్న 8 వ యూనిట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను అధికారులు వివరించారు. సీఎం వెంట ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

అనంతరం కేసీఆర్‌ పెద్దపల్లి జిల్లా మేడారం వద్ద నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ పంప్‌ హౌజ్‌ పనులను, కరీంనగర్‌ జిల్లా రామడుగులో 8 వ ప్యాకేజీ పంప్‌హౌజ్‌ పనులు పరిశీలన చేస్తారు. రామడుగులో అధికారులతో ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షిస్తారు. అనంతరం జగిత్యాల జిల్లా రాంపూర్‌ వద్ద నిర్మించే రివర్స్‌ పంపింగ్‌ బ్యారేజ్‌ పనులను, అక్కడ్నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ మానేరు ప్రాజెక్టు పనులను ఏరియల్‌ సర్వే చేసి సాయంత్రం హైదరాబాద్‌ కు పయనమవుతారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top