‘బార్‌ కౌన్సిళ్ల’ బరిపై స్పష్టత | Clarity on Bar council elections | Sakshi
Sakshi News home page

‘బార్‌ కౌన్సిళ్ల’ బరిపై స్పష్టత

Jun 1 2018 1:49 AM | Updated on Aug 18 2018 6:00 PM

Clarity on Bar council elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ న్యాయవాద మండళ్ల (బార్‌ కౌన్సిల్స్‌) ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. గురువారంతో నామినేషన్ల ఉపసంహర ణ గడువు ముగియడంతో బరిలో ఉన్న వారి లెక్కలు తేలాయి. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలకు 87 నామినేషన్లు దాఖలవగా ఒక ఉపసంహరణ జరిగింది. 86 మంది బరిలో మిగిలారు.

ఏపీ కౌన్సిల్‌కు 109 నామినేషన్లు దాఖలవగా 2 ఉపసంహరణలు జరిగా యి. 107 మంది బరిలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదే శాల మేరకు 2 రాష్ట్రాల కౌన్సిళ్లకు జూన్‌ 29న ఉద యం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతుంది. తెలంగాణ కౌన్సిల్‌కు జూలై 23న, ఏపీలో జూలై 11న కౌంటింగ్‌ జరుగుతుంది. తెలంగాణలో పది చోట్ల ఓటింగ్‌ కేంద్రాలను నోటిఫై చేశారు.

అదృష్టం పరీక్షించుకుంటున్న పాతకాపులు
బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పాతకాపులు మరోసారి బరిలో నిలిచారు. తెలంగాణ నుంచి కాసుగంటి లక్ష్మణకుమార్, ఎ.నర్సింహారెడ్డి, కొల్లి సత్యనారాయణ, సి.ప్రతాప్‌రెడ్డి, కె.సునీల్‌గౌడ్, ఆకుల అనంతసేన్‌రెడ్డి, ఎన్‌.హరినాథ్, జకీర్‌ హుస్సేన్‌ జావీద్‌ మళ్లీ పోటీ చేస్తున్నారు. వీరిలో నర్సింహారెడ్డి ఉమ్మడి బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా చేశారు.

ఏపీ కౌన్సిల్‌లోనూ ఇదే పరిస్థితి! ఎన్‌.ద్వారకనాథ్‌రెడ్డి, కలిగినీడి చిదంబరం, గంటా రామారావు, బండారు వెంకటరమణ మూర్తి, వేలూరి శ్రీనివాసరెడ్డి, సుంకర రాజేంద్రప్రసాద్, ఆలూరు రామిరెడ్డి, సిరిపురపు మాధవీ లత, ముప్పాళ్ల సుబ్బారావు, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, రవి గువేరా, ఎస్‌.కృష్ణమోహన్‌ తదితరులు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో నూ కొందరు అభ్యర్థులు పార్టీల మద్దతు తీసుకుంటున్నారు. ముఖ్య నేతల నుంచి లాయర్లకు ఫోన్లు చేయిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు విదేశీ మద్యంతో పార్టీలిస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement