కేసీఆర్ ఆస్తులపై విచారణకు ఆదేశం | cbi court orders enquiry on assets of kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఆస్తులపై విచారణకు ఆదేశం

Apr 25 2014 11:01 AM | Updated on Aug 15 2018 8:12 PM

కేసీఆర్ ఆస్తులపై విచారణకు ఆదేశం - Sakshi

కేసీఆర్ ఆస్తులపై విచారణకు ఆదేశం

టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆస్తులపై సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించింది.

టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆస్తులపై సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐ ఎస్పీని కోర్టు ఆదేశించింది. కేసీఆర్తో పాటు విజయశాంతి, హరీష్రావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ బాలాజీ వధేరా అనే న్యాయవాది సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు.

కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు, కాంగ్రెస్ నేత విజయశాంతి ముగ్గురూ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారని, సీబీఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని వధేరా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో సీబీఐ కోర్టు ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement