విద్యుత్ తీగలు తెగి పడి పశువుల మృతి | Cattle died in medak district over electric wires damaged | Sakshi
Sakshi News home page

విద్యుత్ తీగలు తెగి పడి పశువుల మృతి

May 9 2016 11:33 AM | Updated on Sep 5 2018 3:37 PM

మెదక్ జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో 23 పశువులు చనిపోయాయి.

కల్హర్: మెదక్ జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో 23 పశువులు చనిపోయాయి. కంగ్టి మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు రైతులు సుమారు 100 పశువులను అంతర్గామ్ గ్రామానికి తీసుకొచ్చారు. పొలాల్లో పశువులు ఉండగా... ఆదివారం రాత్రి గాలిదుమారానికి 11కేవీ విద్యుత్ తీగలు తెగి వాటిపై పడిపోయాయి. విద్యుదాఘాతంతో 22 ఆవులు, ఒక గేదె అక్కడిక్కడే చనిపోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని పశువుల యాజమానులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement