‘జబర్దస్త్’పై గౌడ నేతల ఫిర్యాదు | Case filed Against Jabardasth Comedy Show | Sakshi
Sakshi News home page

‘జబర్దస్త్’పై గౌడ నేతల ఫిర్యాదు

Dec 20 2014 11:48 PM | Updated on Jul 31 2018 4:52 PM

‘జబర్దస్త్’పై గౌడ నేతల ఫిర్యాదు - Sakshi

‘జబర్దస్త్’పై గౌడ నేతల ఫిర్యాదు

ఈ-టీవీలో ప్రసారమవుతున్న వినోద కార్యక్రమం ‘జబర్దస్త్’పై గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

జవహర్‌నగర్: శ్రామిక గౌడ మహిళాజీవన విధానాన్ని అవమానపర్చిన ‘జబర్దస్త్’ కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జిల్లా నాయకులు శనివారం జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఈనెల 18న రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారమైన ‘జబర్దస్త్’ కార్యక్రమంలో కల్లు వృత్తిని, శ్రామికగౌడ మహిళా జీవన విధానాన్ని అవమానించే విధంగా స్కిడ్ ప్రసారం చేశారని, గతేడాది జూలై 11న కూడా ‘జబర్దస్త్’లో కల్లుగీత కార్మికుల్ని ఘోరంగా అవమానించారని అన్నారు.

కుల వృత్తులతోపాటు మహిళలను కించపరిచే విధంగా ఉన్న స్కిట్‌ను ప్లే చేసిన ఆర్టిస్టులతోపాటు కార్యక్రమ న్యాయ నిర్ణేతలు, యాంకర్, ప్రసారం చేసిన ఈటీవీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు బి. నరేష్‌గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు అశోక్‌గౌడ్, కారింగుల రాజుగౌడ్, నవీన్‌గౌడ్ తదితరులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలిస్తున్నామని సీఐ వెంకటగిరి తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement