తమ్ముడినే చంపేశాడు | brother killed his brother | Sakshi
Sakshi News home page

తమ్ముడినే చంపేశాడు

Apr 9 2015 10:33 AM | Updated on Sep 3 2017 12:05 AM

ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపేశాడు ఓ అన్న.

నల్గొండ: ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపేశాడు ఓ అన్న. ఈ సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మడమడక గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది.

వివరాలు.. మడమడక గ్రామ పంచాయతీ పరిధిలోని షాకెల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు నీలం నిరంజన్(28), నీలం రమేష్(22)లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలతో వారి మధ్య కొద్ది రోజులుగా వచ్చిన మనస్ఫర్థలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున రమేష్ నిద్రిస్తున్న సమయంలో నిరంజన్ రోకలిబండతో అతని పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement