ఎల్అండ్ టీ, సర్కారు నిర్లక్ష్యానికి బాలుడు బలి | boy died for L&T negligence : justice chandrakumar | Sakshi
Sakshi News home page

ఎల్అండ్ టీ, సర్కారు నిర్లక్ష్యానికి బాలుడు బలి

Oct 15 2016 2:27 AM | Updated on Oct 16 2018 5:16 PM

ఎల్అండ్ టీ, సర్కారు నిర్లక్ష్యానికి బాలుడు బలి - Sakshi

ఎల్అండ్ టీ, సర్కారు నిర్లక్ష్యానికి బాలుడు బలి

మెట్రో పిల్లర్ గుంతలో పడి మరణించిన చిన్నారి నరసింహ(9) కుటుం బాన్ని ప్రభుత్వం, మెట్రో అధికారులు ఆదుకోవాలని తెలంగాణ ప్రజావేదిక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు.

జస్టిస్ చంద్రకుమార్

 హైదరాబాద్: మెట్రో పిల్లర్ గుంతలో పడి మరణించిన చిన్నారి నరసింహ(9) కుటుం బాన్ని ప్రభుత్వం, మెట్రో అధికారులు ఆదుకోవాలని తెలంగాణ ప్రజావేదిక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ఎల్‌అండ్‌టీ అధికారుల నిర్లక్ష్యమే బాలుడిని బలిగొందన్నారు. శుక్రవారం వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఘటనాస్థలాన్ని సందర్శించారు. బాలుడి తల్లి జ్యోతి, అమ్మమ్మలను ఓదార్చారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ మెట్రో పనుల్లో ఎల్‌అండ్‌టీ కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, 40 అడుగుల గుంత తవ్వి 9నెలలుగా వదిలే శారన్నారు.

రూ.4లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి ఎల్‌అండ్‌టీ, ప్రభుత్వం చేతులు దులుపుకున్నాయన్నారు. మరింత ఆర్థిక సహాయం అందించాలని, జ్యోతికి ఎల్‌అండ్‌టీలో ఉద్యోగం, సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటారుుంచాలన్నారు. ప్రజావేదిక ఉపాధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణ లోక్‌సత్తా అధ్యక్షుడు ఎం నాగరాజు, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు, ఎంఆర్‌పీఎస్ జాతీయ కార్యదర్శి కె.రాజు ఎల్లయ్య మాదిగ, రాష్ట్ర కార్యదర్శి రమేష్ కుమార్ మాదిగ పాల్గొన్నారు. 

చేతులు కాలాక..
చిన్నారి ప్రాణం బలిగొన్న తర్వాత మెట్రో అధికారులు నిద్ర లేచారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా శుక్రవారం గుంత చుట్టూ ఫెన్సింగ్ ఏర్పా టు చేశారు. ఐరన్ షీట్స్‌తో కంచె వేశారు. ఈ జాగ్రత్తలు ముందే తీసుకుని ఉంటే పసివాడి ప్రాణం బలయ్యేది కాదని స్థానికులు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement