బీజేపీ మద్దతుతోనే తెలంగాణ | bjp supports with telangana | Sakshi
Sakshi News home page

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ

Mar 18 2014 12:22 AM | Updated on Mar 29 2019 9:18 PM

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ - Sakshi

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు

వెంకయ్యనాయుడు
 
 సూర్యాపేట, న్యూస్‌లైన్ బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ సూర్యాపేటలో ఆ పార్టీ నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.
 
 తెలంగాణ ప్రజల అభిష్టం, అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. తెలంగాణ ప్రజలు లోతుగా ఆలోచించాలని కోరారు. ప్రాంతీయ పార్టీలకు ఓటువేస్తే కేంద్రంలో ఏమీ చేయలేరన్నారు. 2004లో కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుందని, 2009లో టీడీపీతో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుందని అయినా రాష్ట్రం సాధించలేక పోయిందన్నారు. బీజేపీ మద్దతు లేనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేకపోయేదన్నారు.
 
  సోనియాగాంధీ వరం వల్లే అంటూ తెలంగాణలో.. బీజేపీ వల్లే రాష్ట్రం విడిపోయిందని సీమాంధ్రలో చెబుతూ కాంగ్రెస్ నాటకాలాడుతుందని ఆరోపించారు. బీజేపీ హయాంలోనే సూర్యాపేట అభివృద్ధి చెందిందన్నారు.
 
 సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, రామోజి షణ్ముఖ, పోతెపాక సాంబయ్య, రామినేని ప్రభాకర్, రంగరాజు రుక్మారావు, చలమల్ల నర్సింహ, గోదల రంగారెడ్డి, నల్లగుంట్ల అయోధ్య, జీడి భిక్షం, సారగండ్ల మాణిక్యమ్మ పాల్గొన్నారు.
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement