 
															మెదక్ ఎన్నికలకు బెంగళూరు ఈవీఎంలు
మెదక్ లోక్సభ ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
	హైదరాబాద్: మెదక్ లోక్సభ ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు బెంగళూరు నుంచి ఈవీఎంలను తెప్పిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు.
	
	 డీఈఎల్ కంపెనీకి చెందిన ఈవీఎంలను వాడుతున్నట్టు భన్వర్ లాల్ వెల్లడించారు. భద్రత కోసం 17 కంపెనీల బలగాలను మోహరించనున్నట్టు తెలిపారు. రేపటి నుంచి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
