జిల్లా అటవీ శాఖలో బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించనున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వ విద్యాలయం (జేఎన్టీయూ) ఆధ్వర్యంలో ఈ పరీక్ష కొనసాగనుంది.
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా అటవీ శాఖలో బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించనున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వ విద్యాలయం (జేఎన్టీయూ) ఆధ్వర్యంలో ఈ పరీక్ష కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా బీట్ ఆఫీసర్ పోస్టులు 113 ఖాళీగా ఉండగా 7,744 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంచిర్యాల, మందమర్రి మండల కేంద్రాల్లో 4 వేలు, ఆదిలాబాద్ ప్రాంతంలో 3,744 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరుకానున్నారు. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష జరగనుంది. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతించబోమని మంచిర్యాల ప్రాంతీయ సమన్వయకర్త తిరుపతిరెడ్డి తెలిపారు.
పరీక్షా కేంద్రాలు ఇవే..
మంచిర్యాలలోని హిందీ హైస్కూల్ పక్కన గల మంచిర్యాల విద్యానికేతన్ డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వివేకావర్థిని డిగ్రీ కళాశాల, కాలేజ్‌రోడ్‌లోని చాణక్య డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మండలంలోని ముల్కల్లలో ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే మందమర్రిలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, సింగరేణి మహిళా పీజీ అండ్ డిగ్రీ కళాశాలలో సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఈ రీజియన్‌లో నాలుగు వేల మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారు.
ఆదిలాబాద్‌లో 6 కేంద్రాలు..
ఆదిలాబాద్ రీజియన్‌లో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల, నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల (మావల), ఏఎన్‌ఆర్ టెక్నాలజీ కళాశాల (మావల), లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ శాంతినగర్ (ఆదిలాబాద్), విద్యార్థి డిగ్రీ కళాశాల (ఆదిలాబాద్), గౌతమి డిగ్రీ కళాశాల (ఆదిలాబాద్). ఈ రీజియన్‌లో 3,744 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు ఆదిలాబాద్ ప్రాంతీయ సమన్వయకర్త నాగేందర్‌రావు తెలిపారు