20 వేలు దాటిన టీఎస్‌పీఎస్సీ నియామకాలు | Approximately 20 thousand TSPSC appointments | Sakshi
Sakshi News home page

20 వేలు దాటిన టీఎస్‌పీఎస్సీ నియామకాలు

Feb 13 2019 2:27 AM | Updated on Feb 13 2019 2:27 AM

Approximately 20 thousand TSPSC appointments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుల భర్తీలో భాగంగా తాము చేపట్టిన నియామకాల సంఖ్య 20,679కి చేరుకుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 2,528 పోస్టులను భర్తీ చేసినట్లు ఆమె వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి నేతృత్వంలో సభ్యు లు సి.విఠల్, డి.కృష్ణారెడ్డి, రామ్‌మోహన్‌రెడ్డి, సాయిలు, మన్మథరెడ్డి మంగళవారం సమావేశమై 1,857 ఫారెస్టు బీట్‌ ఆఫీసర్, 699 స్కూల్‌ అసిస్టెంట్, 55 టీజీటీ సైన్స్‌ పోస్టుల ఫలితాలను ప్రకటించినట్లు తెలిపారు.

1,823 ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేశామని, కోర్టు కేసుల కారణంగా 33 పోస్టుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. మరొక పోస్టు అభ్యర్థులు లేక ఖాళీగా ఉండిపోయిందన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా 699 స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ పోస్టులను నోటిఫై చేయగా, 653 పోస్టులు భర్తీ అయ్యాయని తెలిపారు. కోర్టు కేసుల కారణంగా 22 పోస్టుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టామని, వికలాంగులకు సంబంధించిన 22 పోస్టుల ఫలితాలను మెడికల్‌ రిపోర్టులు వచ్చాక ప్రకటిస్తామని తెలిపారు. 52 టీజీటీ సైన్స్‌ పోస్టులను భర్తీ చేశామని వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement