నెలరోజులైనా పరిహారం ఇవ్వరా?

Anxiety of the Kondagattu RTC Bus Accident victims - Sakshi

కొండగట్టు బాధితుల ఆందోళన

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆర్టీసీ ప్రమాద బాధిత కుటుంబాలు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కోసం ఆందోళన లు ఉధృతం చేస్తున్నాయి. ప్రమాదం జరిగి నెలరోజులు కావస్తున్నా.. పరిహారం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిహారం కోసం ఈ నెల ఐదో తేదీన జగిత్యాలలో ధర్నాకు దిగిన విషయం విదితమే. జాయింట్‌ కలెక్టర్‌ రాజేశం హామీతో ఆందోళనను విరమించిన మృతుల కుటుంబాలు.. బుధవారం మళ్లీ కొడిమ్యాల, మల్యాల మండలాల సరిహద్దు దొంగలమర్రి వద్ద దర్నా నిర్వహించా లని మంగళవారం నిర్ణయించారు. ఇది తెలుసుకున్న మల్యాల సీఐ, కొడిమ్యాల ఎస్‌ఐ ధర్నా చేయకుండా భగ్నం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందుతుందని, జిల్లా అధికారులతో మాట్లాడిస్తామన్నారు. 40మంది బాధిత కుటుంబాలు కలెక్టర్‌ శరత్, జేసీ రాజేశంను కలసి తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరాయి. వారం లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటా నని కలెక్టర్‌ చెప్పడంతో వారు శాంతించారు.  

త్వరలోనే ఆదుకుంటాం: కలెక్టర్‌  
కొండగట్టు ప్రమాద బాధిత కుటుంబాలను త్వరలోనే ఆదుకుంటామని కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. అంత్యక్రియలకు రూ.20 వేలు ఇచ్చామని. ఆర్టీసీ రూ.3లక్షల చొప్పున అన్ని కుటుంబాలకు పంపిణీ చేశారన్నారు. ప్రభు త్వం నుంచి రావాల్సిన రూ. 5లక్షలు త్వరలోనే మంజూరు కానున్నాయని పేర్కొన్నారు. 

పరిస్థితి దయనీయం: ప్రమాదంలో గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న.. వికలాంగులుగా మారిన వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైంది. బాధితులం దరూ నిరుపేదలే కావడంతో మెరుగైన వైద్యం పొందలేని స్థితిలో ఉన్నారు. మండల పరిధిలో గాయాలపాలైన 43 మందిలో కొందరు పూర్తి గా కోలుకోలేకపోయినా.. ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యాలు వారిని డిశ్చార్జి చేశారు. కాళ్లూ చేతులు విరిగి మంచానికే పరిమితమైన వారు రెండ్రోజులకోసారి వైద్య పరీక్షలకు వెళ్లాలన్నా రవాణా ఖర్చులు లేక వెళ్లలేని స్థితిలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top