అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ ఏర్పాటు

Annapureddy Palli MPP Established - Sakshi

సాక్షి, అన్నపురెడ్డిపల్లి: ఉమ్మడి చండ్రుగొండ మండలం నుంచి విడిపోయిన అన్నపురెడ్డిపల్లి మండలంలో ఒక జెడ్పీటీసీ, ఆరు ఎంపీటీసీ స్థానాలతో మండల ప్రజాపరిషత్‌ (ఎంపీపీ) ఏర్పాటవుతుం ది. వీటికి రిజర్వేషన్లు కూడా ఖరార య్యా యి. 2016లో నూతన జిల్లాలతోపాటు నూతన మం డలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిలో  భాగంగా, చండ్రుగొండ మండలం నుంచి అన్నపురెడ్డిపల్లి మండలం ఆవిర్భవించింది. అప్పుడు తహసీల్దార్, పోలీస్‌ స్టేషన్, వ్యవసాయాధికారి, ఐకేపీ కార్యాలయాలు మాత్రమే ఏర్పాట య్యాయి. ఎంపీడీఓ, ఎంపీపీ కార్యాలయాలు ఉమ్మడి చండ్రుగొండ మండల కేంద్రంగానే కొనసాగాయి. మండల, జిల్లాపరిషత్‌ ఎన్నికలు త్వ రలో జరగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.

తగ్గిన ఎంపీటీసీ స్థానం
గతంలో అన్నపురెడ్డిపల్లి మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. మండల జనా భా ప్రాదిపదికన వీటిని కేటాయిచారు.  మండలానికి ఆరు ఎంపీటీసీ స్థానాలను అధికారులు కేటాయించారు. గతంలో పెద్దిరెడ్డిగూడెం–1, పెద్దిరెడ్డిగూడెం–2 స్థానాలు ఉండేవి. తాజాగా, పెద్దిరెడ్డిగూడెం–2  ఎంపీటీసీ స్థానాన్ని అధికారులు రద్దు చేశారు. మండల మొత్తం జనాభా 21130 మంది. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ప్రతి 3500 జనాభాకు ఒక ఎంపీటీసీ ఏర్పాటు చేయటంతో మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గింది. దీంతో, అన్నపురెడ్డిపల్లి మండలం ఆరు ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలతో మండల పరిషత్‌గా ఏర్పడనుంది.

రిజర్వేషన్లు ఇలా.. 
ఈ మండల పరిషత్, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. అందుకే, మొత్తం స్థానాల్లో ఎసీకి సగం, జనరల్‌కు సగం కేటాయించారు. అన్నపురెడ్డిపల్లి–1(జనరల్‌), అన్నపురెడ్డిపల్లి–2(ఎస్టీ జనరల్‌), పెంట్లం –జనరల్‌(మహిళ), నర్సాపురం–ఎస్టీ(మహిళ),గుంపెన–జనరల్, పెద్దిరెడ్డిగూడెం–ఎస్టీ(మహిళ) కు రిజర్వయ్యాయి. మండల పరిషత్‌ ప్రెసిడెంట్‌(ఎంపీపీ)–ఎస్టీ (జనరల్‌), జెడ్పీటీసీ మెంబర్‌–జనరల్‌(మహిళ)కు కేటాయించారు.

ఆ స్థానంపై అందరి దృష్టి
మొత్తం ఆరు ఎంపీటీసీ స్థానాలకుగాను అన్నపురెడ్డిపల్లిలోనే రెండు ఉన్నాయి. అన్నపురెడ్డిపల్లి–2 ఎస్టీ జనరల్‌. ఇక్కడి నుంచి గెలుపొందిన వారికి  ఎంపీపీ పీఠంపై కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు కొందరు తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారు. ఇక్కడి నుంచి తన సతీమణిని బరి లోకి దింపడం ద్వారా, ఎంపీపీ పీఠాన్ని చేజిక్కిం చుకునేందుకు ఉపాధ్యాయుడొకరు  తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top