పారెస్ట్ ఆఫీస్‌పై తండా వాసులు దాడి చేయడంతో పోలీసులు ఆ గ్రామంలో తనిఖీలు చేపట్టారు.
పెద్దవూర(నల్లగొండ): పారెస్ట్ ఆఫీస్‌పై తండా వాసులు దాడి చేయడంతో పోలీసులు ఆ గ్రామంలో తనిఖీలు చేపట్టారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం మెట్టలతండ గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు..మెట్టలతండా వాసులు అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే రాళ్లను రెండు ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తుండగా బుధవారం సాయంత్రం అధికారులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల సహాయంతో ఆ ట్రాక్టర్లును స్వాధీనం చేసుకొని ఒక ట్రాక్టరును పారెస్ట్ ఆఫీస్‌లో మరోక దానిని పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.
ఈ నేపధ్యంలో తండావాసులు బుధవారం రాత్రి అధికారులు వేధిస్తున్నారన్న నేపంతో పారెస్ట్ఆఫీస్‌పై దాడి చేసి ట్రాక్టరును తరలించుకొని వెళ్లారు. దీంతో,విషయం తెలిసిన పోలీసులు 150మంది సభ్యులతో వెళ్లి గురువారం తెల్లవారుజామున గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పారెస్ట్ ఆఫీస్‌పై దాడి చేసిన వారిని గుర్తించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.