సులభ వాణిజ్యం (ఈఓడీబీ) ర్యాంకింగులో రాష్ట్రం మెరుగైన స్థానం సాధించేలా..బ్రిటన్‌తో అనుబంధం ఏర్పరచుకునేందుకు తెలంగాణ ఆసక్తితో వుందని పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్ వెల్లడించారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్ వెల్లడి
సులభతర వాణిజ్యంపై పరిశ్రమల విభాగం వర్క్‌షాప్
హైదరాబాద్: సులభ వాణిజ్యం (ఈఓడీబీ) ర్యాంకింగులో రాష్ట్రం మెరుగైన స్థానం సాధించేలా..బ్రిటన్‌తో అనుబంధం ఏర్పరచుకునేందుకు తెలంగాణ ఆసక్తితో వుందని పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్ వెల్లడించారు. సులభ వాణిజ్యంలో బ్రిటన్ అనుభవాలు, పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు పరిశ్రమల శాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సులభ వాణిజ్య రంగంలో మెరుగైన ర్యాంకు సాధనకు పరిశ్రమల శాఖ చేపట్టిన సంస్కరణలను వివరించారు.
రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్న వారు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తూ, సంస్కరణలు చేపట్టడాన్ని..బ్రిటన్ వాణిజ్య ఆవిష్కరణలు, నైపుణ్య విభాగం కార్యక్రమం డెరైక్టర్ ఫిల్ ఓవెన్ ప్రశంసించారు. పరస్పర సహకారం ద్వారా అభివృద్ధిలో రాష్ట్రం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు. ఈ వర్క్‌షాప్‌కు బ్రిటిష్ హై కమిషన్ అధికారులు రేచల్ హాలోవే, ఔర్‌దీప్ నందీ, నళిని రఘురామన్, పరిశ్రమల శాఖ జాయింట్ డెరైక్టర్ ఎస్.సురేశ్ తదితరులు హజరయ్యారు.