breaking news
better ranking
-
ఆ జాబితాలో భారత్‌కు మెరుగైన ర్యాంకు
న్యూఢిల్లీ : 2020లో జీవించేందుకు అత్యంత అనువైన దేశాల్లో భారత్ టాప్ 25లో స్ధానం దక్కించుకుంది. ఈ జాబితాలో 25వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్న భారత్ 2019లో 27వ స్దానంలో నిలిచింది. వార్టన్ స్కూల్ ఆఫ్ యూఎస్ సహకారంతో యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ చేపట్టిన ఈ సర్వేలో ఆసియా ప్రాంతంలో భారత్ కంటే కేవలం చైనా, సింగపూర్, దక్షిణ కొరియా, యూఏఈ వంటి నాలుగు దేశాలే ముందున్నాయి. జీవించేందుకు అనువైన దేశాల్లో భారత్ స్ధానం మెరుగుపడినా దేశంలో చిన్నారులు, మహిళల ఎదుగుదల, వారి పరిస్థితిలో మాత్రం మన దేశం పట్ల సర్వేలో పాల్గొన్న వారి ప్రతిస్పందన నిరాశాజనకంగా ఉండటం గమనార్హం. చిన్నారుల ఎదుగుదలకు అనువైన దేశాల్లో భారత్ 59వ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విభాగంలో సింగపూర్ 22వ స్ధానంలో ఉండగా అంతర్గత సమస్యలు ఎదుర్కొనే కెన్యా, ఈజిప్ట్ వంటి దేశాలు సైతం భారత్ కంటే మెరుగైన ర్యాంకులు సాధించాయి. 2019తో పోలిస్తే ఈ విభాగంలో ఆరు ర్యాంకులు మెరుగుపడటమే భారత్‌కు ఊరట ఇచ్చే అంశం. ఇక మహిళల జీవనానికి అనువైన దేశాల జాబితాలో 2019తో పోలిస్తే ఒక స్ధానం దిగజారి 2020లో భారత్ 58వ ర్యాంక్‌తో సంతృప్తిపడాల్సి వచ్చింది. పశ్చిమాసియా దేశాలు, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాలు భారత్ కంటే ఎగువ ర్యాంకులు సాధించాయి. ఈ సర్వేలో మన పొరుగు దేశాలు చైనా, శ్రీలంకలు సైతం మహిళలకు అనువైన జీవనం కల్పించడంలో మనకంటే ముందున్నాయి. -
మెరుగైన ర్యాంకింగ్ కోసం బ్రిటన్‌తో అనుబంధం
రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్ వెల్లడి సులభతర వాణిజ్యంపై పరిశ్రమల విభాగం వర్క్‌షాప్ హైదరాబాద్: సులభ వాణిజ్యం (ఈఓడీబీ) ర్యాంకింగులో రాష్ట్రం మెరుగైన స్థానం సాధించేలా..బ్రిటన్‌తో అనుబంధం ఏర్పరచుకునేందుకు తెలంగాణ ఆసక్తితో వుందని పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్ వెల్లడించారు. సులభ వాణిజ్యంలో బ్రిటన్ అనుభవాలు, పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు పరిశ్రమల శాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సులభ వాణిజ్య రంగంలో మెరుగైన ర్యాంకు సాధనకు పరిశ్రమల శాఖ చేపట్టిన సంస్కరణలను వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్న వారు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తూ, సంస్కరణలు చేపట్టడాన్ని..బ్రిటన్ వాణిజ్య ఆవిష్కరణలు, నైపుణ్య విభాగం కార్యక్రమం డెరైక్టర్ ఫిల్ ఓవెన్ ప్రశంసించారు. పరస్పర సహకారం ద్వారా అభివృద్ధిలో రాష్ట్రం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు. ఈ వర్క్‌షాప్‌కు బ్రిటిష్ హై కమిషన్ అధికారులు రేచల్ హాలోవే, ఔర్దీప్ నందీ, నళిని రఘురామన్, పరిశ్రమల శాఖ జాయింట్ డెరైక్టర్ ఎస్.సురేశ్ తదితరులు హజరయ్యారు.