అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్‌కు వెళ్లాల్సిందే | All the government departments to digital | Sakshi
Sakshi News home page

అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్‌కు వెళ్లాల్సిందే

Dec 13 2016 3:26 AM | Updated on Aug 30 2019 8:24 PM

అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్‌కు వెళ్లాల్సిందే - Sakshi

అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్‌కు వెళ్లాల్సిందే

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్‌ రూపంలో చెల్లింపులు జరపాలని రాష్ట్ర ఐటీ, పరి శ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు డిజిటల్‌ రూపంలో చెల్లింపులు జరపాలని రాష్ట్ర ఐటీ, పరి శ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. సాధ్యమైనంత ఎక్కువగా నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించాలని, దశలవారీగా తెలం గాణను నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని కేటీఆర్‌ పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిణామాలను ఒక అవకాశంగా మార్చుకుంటామని, నగదు రహిత విధా నంతో పాలనా వ్యవస్థలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుం టామన్నారు. అన్ని శాఖలు అంతిమంగా డిజిటల్‌ చెల్లింపులకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలతో ప్రభుత్వం నియమించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సోమవారం సచివాలయంలో సమా వేశమైంది.

వివిధ శాఖల కార్యదర్శులు, బ్యాంకుల ప్రతినిధులు, టీ–వ్యాలెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు సమావేశానికి హాజరయ్యారు. నగదు రహిత చెల్లింపుల ద్వారా ప్రజలకు సౌకర్యం పెరగాలన్నదే తమ ప్రాథమిక లక్ష్యమని కేటీఆర్‌ అన్నారు. నగదు రహిత లావాదేవీలను గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లోని ప్రజలకు సమాంతరంగా తీసుకెళ్తామ న్నారు. ఆర్థిక లావాదేవీలపై ప్రజల్లో, వ్యాపారుల్లో చైతన్యం పెంచేందుకు ఐటీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమా లను ఈ నెల 7 నుంచి ప్రారంభించామ న్నారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య జరిగే అన్ని ఆర్థిక లావాదేవీలను టీ–వ్యాలెట్‌ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తామన్నారు.

ప్రజలు, ప్రైవేట్‌ సంస్థలు చేసే లావాదేవీలపై చార్జీల్లేకుండా పూర్తిగా ఉచితం చేయాలని కేంద్రాన్ని కోరతామ న్నారు. వివిధ సంస్థలు,     బ్యాంకులు టీ– వ్యాలెట్‌తో కలసి పనిచేసేలా ప్రయత్ని స్తామన్నారు. టీ–వ్యాలెట్‌తో ఇతర వ్యాలె ట్లకు సైతం చెల్లింపుల సౌకర్యానికి అను మతించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి నేరుగా ప్రధానితో మాట్లాడతానని చెప్పినట్లు పేర్కొన్నారు. టీ–వ్యాలెట్‌ మీద ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. టీ–వ్యాలెట్‌ అంతర్జాతీయ ప్రమా ణాలతో ఉంటుందని, భద్రత, సదుపాయం వంటి అంశాల్లో అత్యుత్తమంగా ఉంటుందని జయేశ్‌రంజన్‌ చెప్పారు. డిజిటల్‌ చెల్లిం పులపై ఏర్పాటైన సురేశ్‌చందా టాస్క్‌పోర్స్‌ కమిటీ అధ్యయన నివేదిక, సిఫారసులను కేబినెట్‌ సబ్‌ కమిటీకి సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement