
బంధువు కత్తి దాడిలో మహిళ మృతి
పాతకక్షలతో మహిళను హత్య చేసిన సంఘటన నగరంలోని సుల్తాన్‌బజార్ పరిధిలోని లక్ష్మినారాయణ టెంపుల్ రంగ్‌మహల్ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
హైదరాబాద్: పాతకక్షలతో మహిళను హత్య చేసిన సంఘటన నగరంలోని సుల్తాన్‌బజార్ పరిధిలోని లక్ష్మినారాయణ టెంపుల్ రంగ్‌మహల్ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన సోనిబాయ్(35) ఉదయం ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో ఆమె దూరపు బంధువు విచక్షణారహితంగా కత్తితో ఆమెపై దాడి చేసింది.
ఇది గమనించిన సోనిబాయ్ భర్త ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. ఆ మహిళ సోనిబాయ్ భర్తపై కూడా కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో సోనిబాయ్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.