పేలిన ఎయిర్‌గన్.. బాలుడి చెంపలోకి బుల్లెట్ | A kid injured with missfirired of airgun | Sakshi
Sakshi News home page

పేలిన ఎయిర్‌గన్.. బాలుడి చెంపలోకి బుల్లెట్

May 30 2015 12:09 AM | Updated on Sep 3 2017 2:54 AM

పేలిన ఎయిర్‌గన్.. బాలుడి చెంపలోకి బుల్లెట్

పేలిన ఎయిర్‌గన్.. బాలుడి చెంపలోకి బుల్లెట్

పిల్లలు ఎయిర్ గన్‌తో సరదాగా ఆడుకుంటుండగా అది మిస్ ఫైర్ అయింది.

నర్సింహులపేట(వరంగల్ జిల్లా): పిల్లలు ఎయిర్ గన్‌తో సరదాగా ఆడుకుంటుండగా అది మిస్ ఫైర్ అయింది. దీంతో ఓ బాలుడి చెంపలోకి బుల్లెట్ దూసుకెళ్లిన సంఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దముప్పారంలో శుక్రవారం జరిగింది. గ్రామంలో సర్పంచ్ వెలుగు ఉపేందర్ కుమారుడు ప్రేమ్‌సాయి, విద్యుత్ శాఖలో పని చేస్తున్న పులిగుజ్జ సైదులు కుమారుడు మనోజ్‌లు స్నేహితులు. వీరు శుక్రవారం సర్పంచ్ వెలుగు ఉపేందర్ ఇంట్లో ఆడుకుంటున్నారు. సరదాగా ఇంట్లో గోడకు తగిలించి ఉన్న ఎయిర్‌గన్ తీసుకొని ప్రేమ్‌సాయి ఆడుతుండగా, మిస్‌ఫైర్ అయి ఎదురుగా ఉన్న మనోజ్ చెంపలోకి బుల్లెట్ దూసుకుపోయింది. మనోజ్‌ను చికిత్స నిమిత్తం తొర్రూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement