మార్చి చివరి నాటికి బహిరంగ మలవిసర్జన లేని 7 జిల్లాలు రూపుదిద్దుకోనున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ తెలిపారు
సాక్షి, హైదరాబాద్: మార్చి చివరి నాటికి బహిరంగ మలవిసర్జన లేని 7 జిల్లాలు రూపుదిద్దుకోనున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ తెలిపారు. గురువారం ఎస్పీ సింగ్, కేంద్ర ప్రభుత్వ తాగునీరు, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.
ఈ సందర్భంగా.. వచ్చే ఏడాది అక్టోబర్ 2 నాటికి బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఇందుకు సరిపడా నిధులు ఇచ్చి సహకరించాలని కేంద్ర కార్యదర్శిని సీఎస్ కోరారు. ఇప్పటికే ఓడీఎఫ్ సాధించిన గ్రామాలు, పట్టణాలలోని ప్రజలు మరుగు దొడ్లను వినియోగించుకునే విధంగా పర్యవేక్షించాలని కలెక్టర్లను కోరారు.