364 నామినేషన్లు

364 Candidates Nominations Completed - Sakshi

305 మంది అభ్యర్థులు దాఖలు 

 చివరిరోజు భారీగా అందజేత 

పోటాపోటీగా ర్యాలీలు.. సభలు 

రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల  పరిసరాల్లో  జనసందోహం

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు వెల్లువెత్తాయి. కొత్త రంగారెడ్డి జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం 305 మంది అభ్యర్థులు 364 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలకు వరుస కట్టారు. ఈ ఒక్కరోజే అత్యధికంగా 180 మంది అభ్యర్థులు 231 సెట్లను ఆర్‌ఓలకు అందజేశారు.

అభ్యర్థులు నామినేషన్ల దాఖలు సందర్భంగా భారీగా జనసమీకరణ చేశారు. పోటాపోటీగా జనాలను తరలించి బలప్రదర్శన చేశారు. నామినేషన్ల దాఖలుతోనే తామేమిటో తెలియజేయాలనే తపన దాదాపు అందరిలోనూ కనిపించింది. కార్లు, బైక్‌ ర్యాలీలతో హోరెత్తించారు. కళా బృందాలను సైతం రంగంలోకి దించాయి. శ్రేణులు భారీ జెండాలు చేతబట్టి ఉర్రూతలూగాయి.

గ్రామాల నుంచి మొదలుకొని నియోజకవర్గ కేంద్రాల వరకు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు అక్కడక్కడా సభలు నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల ముఖ్యనాయకులు కూడా నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యారు.  

అత్యధికంగా ఎల్బీనగర్‌లో.. 
ఎల్బీనగర్‌ నియోజకవర్గానికి అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి మొత్తం 58 మంది తమ నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఆ తర్వాత స్థానంలో శేరిలింగంపల్లికి 49 దాఖలయ్యాయి. అతి స్వల్పంగా చేవెళ్ల స్థానానికి 25 నామినేషన్లు అందాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా భారీగానే నేమినేషన్లు వేశారు. కాగా, మంగళవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య 
చేవెళ్ల25, చివరి రోజు12 ,ఇబ్రహీంపట్నం 39, చివరి రోజు 25, షాద్‌నగర్‌ 32, చివరి రోజు 2 ,కల్వకుర్తి 30, చివరి రోజు14 , మహేశ్వరం 27, చివరి రోజు 20,  రాజేంద్రనగర్ ‌45 , చివరి రోజు 23 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top