27 నుంచి చతురాయతన మహాసౌరయాగం | 27 Great saurayagam caturayatana | Sakshi
Sakshi News home page

27 నుంచి చతురాయతన మహాసౌరయాగం

Nov 9 2014 12:31 AM | Updated on Sep 2 2017 4:06 PM

వరంగల్ ములుగు రోడ్ హనుమాన్ జంక్షన్ సమీపంలోని శ్రీ రమాసత్యనారాయణ స్వామి ఆలయం...

దేశంలోనే మొదటిసారి

వరంగల్: వరంగల్ ములుగు రోడ్ హనుమాన్ జంక్షన్ సమీపంలోని శ్రీ రమాసత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 27 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు చతురాయతన మహాసౌరయాగం నిర్వహించనున్నట్లు పండితుడు జాగర్లపూడి వీరభద్రశర్మ తెలిపారు. ఈ మేరకు ఆలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా మహాసౌరయాగం నిర్వహిస్తున్నామని వివరించారు.

ప్రతి రోజు  ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 మంది బ్రాహ్మణులతో త్రిచ, సౌర, అరుణ కేతుక సహిత  సూర్య నమస్కారాలు చేస్తారని వివరించారు. చివరి రోజు పూర్ణాహూతి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన యూగానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement