బరిపై గురి

2019 Elections Hat In Nizamabad Politics - Sakshi

క్షేత్ర స్థాయిలో బలోపేతానికి ప్రధాన పార్టీల ఆరాటం

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: రానున్నది ఎన్నికల కాలం.. స్థానిక సంస్థలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ క్షేత్ర స్థాయిలో బలోపేతంపై దృష్టి సారించాయి. ఎన్నికల్లో ఓట్లు రాల్చడంలో కీలకమైన బూత్‌ కమిటీలపై ప్రస్తు తం ప్రధానంగా ఫోకస్‌ చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆయా పార్టీల నాయకత్వాలు ఈ ప్రక్రియను వేగవంతం చేయా లని ఆదేశించాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల శ్రేణులు ఈ దిశగా చర్యలు చేపట్టాయి.

అధికార టీఆర్‌ఎస్‌ రాష్ట్ర స్థాయి నాయకులను జిల్లా ఇన్‌చార్జీలుగా నియమించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్‌ కమిటీలతో సమావేశం నిర్వహిస్తోంది. ఎంపీ కవిత ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ సమావేశాలపై దృష్టి సారించారు. మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులను ఈ సమావేశాలకు పిలిపించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవల నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర నేత కర్నె ప్రభాకర్, ఆర్మూర్‌ సమావేశానికి మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, బోధన్‌ సమావేశానికి తుమ్మల నాగేశ్వర్‌రావు హాజరయ్యారు. ప్రభు త్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు.

‘శక్తి’ చాటేందుకు కాంగ్రెస్‌ యత్నం..
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కూడా క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ నెల 16న నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో నెలాఖరులోగా క్షేత్ర స్థాయి నిర్మాణం పూర్తి చేయాలని ఆ పార్టీ వ్యవహారాల జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాస కృష్ణన్‌ దిశానిర్దేశం చేశా రు. బూత్‌ కమిటీల నియామకంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్‌.. శక్తి యాప్‌ ద్వారా పార్టీ ప్రాథమిక సభ్యత్వాలు చేయిస్తోంది. సదరు వ్యక్తుల ఓటరు కార్డును ఈ యాప్‌ లో నమోదు చేస్తున్నారు. ఒక్కో బూత్‌ స్థాయిలో 15 మంది సభ్యులతో కమిటీల నియామకం చేపట్టింది. ఈ ప్రక్రియను ఆయా నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశిస్తున్న నాయకులుకు అప్పగించారు. కామారెడ్డి, బోధన్‌ వంటి నియోజవర్గాలో షబ్బీర్‌అలీ, పి.సుదర్శన్‌రెడ్డి వంటి నేతలు ఈ ప్రక్రి య ను పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు, ము గ్గురు నాయకులు టికెట్‌ రేసులో ఉంటే, ఒక్కో నే తకు ఒకటీ, రెండు మండలాలను అప్పగించారు. ఇలా నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం రేసులో ఉన్న నలుగురు నాయకులకు తలా ఒకటీ, రెం డు మండలాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు.  

కమిటీలు వేయనున్న వైఎస్సార్‌సీపీ.. 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా జిల్లాలో బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా అడహక్‌ కమిటీని ప్రకటించిన అధినాయకత్వం.. ఇటీవలే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా షేక్‌ తజ్ముల్‌ హుస్సేన్‌ను నియమించింది. పూర్తి స్థాయి జిల్లా కమిటీని, అనుబంధ విభాగాలను త్వరలో ప్రకటించనుంది. ఆ తర్వాత మండల, గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇక, ఫ్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితి కూడా జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇటీవలే జిల్లా కన్వీనర్‌గా అంబోజీ ప్రసాద్‌ను నియమించిన టీజేఎస్‌.. క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణానికి చర్యలు చేపట్టింది.

సన్నద్ధమవుతున్న కమల‘దళం’.. 
ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ కూడా సన్నాహాలు చేపట్టింది. బూత్‌ కమిటీల నియా మకంతో పాటు, పన్నా ఇన్‌చార్జీలను కూడా నియమించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాస్‌ ఈ ప్రక్రియను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మూ డు, నాలుగు బూత్‌ కమిటీలను శక్తి కేంద్రంగా ఏర్పాటు చేసి, ఈ కేంద్రానికి ఒక ఇన్‌చార్జిని నియమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలకు అప్పగించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top