లారీ, ఆటో ఢీ.. ఇద్దరి మృతి | 2 died and 6 injured in a lorry and auto collisioned incident | Sakshi
Sakshi News home page

లారీ, ఆటో ఢీ.. ఇద్దరి మృతి

Jul 26 2015 3:02 PM | Updated on Sep 3 2017 6:13 AM

లారీ, ఆటో ఢీ.. ఇద్దరి మృతి

లారీ, ఆటో ఢీ.. ఇద్దరి మృతి

ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది.

మెదక్: ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జ్లిలా గజ్వేల్ మండలం సిరిగిరిపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు.. 11 మంది ప్రయాణికులతో జగదేవ్‌పూర్ నుంచి గజ్వేల్ వెళ్తున్న ఆటో సిరిగిరిపలి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

దీంతో ఆటోలో ఉన్న జగదేవ్‌పూర్ గ్రామానికి చెందిన రాకేష్(16)తోపాటు దాసేపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ(56) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ఉన్న మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement