-
హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను వదిలేసి అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల లెక్కలను విడుదల చేశారు ఉత్తమ్. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. 43. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రతి విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హరీష్ కు ఉత్తమ్ హితవు పలికారు. ఒకసారి హరీష్ లెక్కలు చూసి మాట్లాడితే మంచిదని సూచించారు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్‌కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు.ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్ఇందిరమ్మ ఇళ్లపై బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ లాగ కాదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇందిరమ్మ ఇండ్ల కోటా ఇస్తామన్నారు పొంగులేటి. ఇక ఏపీలో కలిసిన ప్రజల స్థానికతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే.. : హరీష్ రావు ఏమన్నారంటే
హైదరాబాద్: బీఆర్ఎస్ లో విభేదాలున్నాయంటూ గత కొంతకాలంగా వస్తున్న రూమర్లకు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు చెక్ పెట్టారు. అసలు బీఆర్ఎస్ లో విభేదాలున్నాయనే వార్తల్లో నిజం లేదన్నారు. దీనిపై ఈరోజు(మంగళవారం) హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ‘ మా పార్టీ బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవు. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా. మా అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా’ అని హరీష్ రావు స్పష్టం చేశారు.కాగా, ఎప్పట్నుంచో ‘బీఆర్ఎస్ లో విభేదాలు’ అనే మాట తరచు వినిపిస్తూ వస్తోంది. ప్రధానంగా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ బాధ్యతల్ని ఎవరు మోస్తారు అనేది ప్రధానంగా నడిచే చర్చ. ఇక్కడ కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆ బాధ్యతల్ని తీసుకుంటారా?, లేక మేనల్లుడైన హరీష్ రావు తీసుకుంటారా? అనే దానిపై రకరకాల కథనాలు వచ్చాయి. ఒకవేళ కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే, హరీష్ రావు పరిస్థితి ఏంటి?, హరీష్ రావు మరొక పార్టీవైపు కన్నేస్తారా? అనేదే ప్రధానంగా నడిచిన చర్చ.దీనికి ముగింపు పలికారు హరీష్ రావు. తమ పార్టీలో విభేదాలు లేవని, కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే తనకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు. , దాన్ని తాను స్వాగతిస్తాననన్నారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానన్నారు హరీష్ రావు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్‌కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. -
నువ్వు ముదిరాజ్వా.. రెడ్డివా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను బీసీ బిడ్డగా ఎవరూ ఆమోదించడం లేదని, ఆయన అసలు ము దిరాజ్ కులానికి చెందిన వారో, లేక రెడ్డి కులానికి చెందిన వారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అనుభవమున్న నాయకుడు రాజేందర్‌కు ఇంత దిగజారుడు తనం ఎందుకో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఇష్టారాజ్యంగా మాట్లాడడం తగదని, ఇక ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిదని హెచ్చరించారు. సోమవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, పీసీసీ నేతలు ఈర్ల కొమురయ్య, సలీం, గజ్జి భాస్కర్, ఇందిరా శోభన్‌లతో కలసి ఆయన మాట్లాడుతూ.. ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం లేదనే నిస్పృహలో ఉన్నారని, అందుకే కిషన్‌రెడ్డిపై ఉన్న ఆక్రోశాన్ని రేవంత్‌పై వెళ్లగక్కుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలన లోని అలీబాబా 40 దొంగల్లో ఈటల కూడా ఒక సభ్యుడని, రాష్ట్రం అప్పుల పా లు కావడానికి కేసీఆర్‌తో పాటు ఈటల నిర్వాకం కూడా కారణమని పేర్కొన్నా రు. దద్దమ్మగా ఉన్న ఈటలను అప్పుడు బీఆర్ఎస్ నుంచి తంతే వెళ్లి బీజేపీలో ప డ్డారని, మళ్లీ ఇప్పుడు అక్కడ ఇమడలేక కేసీఆర్‌వైపు చూస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. సీఎంను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, తాము ఒక్క విజిలేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేస్తారో తెలియదని అ న్నారు. కేటీఆర్ బాణిలోనే రాజేందర్ మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతోంది కిషన్‌రెడ్డి, రాజేందర్ గ్యాంగేనని మండిపడ్డారు. -
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, మేడ్చల్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మేడ్చల్‌లోని ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటల ఇంటి వద్ద పోలీసులు మోహరించి.. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.వివరాల ప్రకారం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను శాడిస్ట్ అంటూ ఈటల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు ఈరోజు.. ఈటల ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారీగా సంఖ్యలో ఈటల ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే భారీ సంఖ్యలో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు ఈటల ఇంటికి చేరుకున్నాయి.అనంతరం, బీజేపీ ఎంపీ ఈటల మాట్లాడుతూ..‘కలెక్టరేట్ల ముట్టడి, కార్యాలయాల ముట్టడి చూశాం.. ఇళ్లను ముట్టడిస్తారా?. కుటుంబాలు ఉంటాయి.. ఇళ్లను ముట్టడించడం పద్ధతి కాదు. అనుభవం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోయి ఉంటే హైదరాబాద్‌లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందో చూడాలి. పాలకుడు అనే వాడు ఏదైనా నిర్మించే ప్రయత్నం చేస్తారు.. డిస్‌స్ట్రక్షన్ చేస్తారా?. 50 ఏళ్లుగా మొదటిసారి చూస్తున్నాను. డిస్‌స్ట్రక్షన్ చేస్తున్న మొట్టమొదటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసులకు భయపడేది లేదు.. అధికారం లేనినాడే కొట్లాడిన పార్టీ బీజేపీ. ఎవరు మోసం చేసే వాళ్లు, ఎవరు సంస్కార హీనులో ప్రజలే చెబుతారు. కుక్కలా అరిస్తే ఏం వస్తుంది?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘మేము తిట్టడం మొదలుపెడితే ఉరేసుకోవాలి’
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలాన్ని వాడటం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు ఎంతవరకూ కరెక్ట్ అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈటెల మాట్లాడిన మాటలు ఎంపీ స్థాయి మాటల్లా లేవని, గంజాయి తాగిన వ్యక్తి మాటల్లా ఉన్నాయంటూ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ పై ఈటెల చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టిన జగ్గారెడ్డి.. ‘ నేను తిట్టడం కోసం ప్రెస్ మీట్ పెట్టా. మీకేనా తిట్టడం వచ్చింది.. మాకు రాదా?, మేము తిట్టడం మొదలుపెడితే ఉరేసుకోవాలి’ అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఈటెల ఏరోజైనా సీఎంను కలిసి తన పార్లమెంట్ సమస్యల గురించి అడిగారా? అని జగ్గారెడ్డి నిలదీశారు. ఏదో ఫ్రస్టేషన్ లో ఈటెల మాట్లాడుతున్నట్లు ఉందని, సీఎంను తనకు పోస్ట్ వస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఉందన్నారు.ఈటెల పరిధి దాటి మాట్లాడాడు కాబట్టే తాను కూడా మాట్లాడుతున్నానన్నారు జగ్గారెడ్డి. ఆయన పెద్ద తోపేంద కాదని, పెద్ద పర్సనాలిటీ అని ఈటెల తనకు తానే ఊహించుకుంటున్నారని విమర్శించారు. గౌరవ ప్రదమైన విమర్శలు చేస్తే తప్పులేదు కానీ, ఈ తరహా వ్యాఖ్యలు సీఎంపై చేస్తారా అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి తెచ్చే తెలివి లేదు కానీ ఉద్దెర విమర్శలు ఎందుకన్నారు జగ్గారెడ్డి.సీఎం ఓ తుగ్లక్. నువ్వో శాడిస్ట్కాంగ్రెస్ ప్రభుత్వం తలాతోకా లేకుండా వ్యవహరిస్తోందని, ఇదిలాగే ఉంటే ఇంకా ఎన్నో రోజులు కొనసాగదని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేం దర్ హెచ్చరించారు. 'ఇది తుగ్లక్ ప్రభుత్వం, సీఎం ఓ తుగ్లక్. నువ్వో శాడిస్ట్, సైకోవి కాబట్టి ప్రజలను ఏడిపి స్తున్నావు. మిస్టర్ ముఖ్యమంత్రి నీ కింద ఏం జరుగుతుందో సోయిపెట్టు. నీ కింది అధికారులు ఏం చేస్తున్నారో దృష్టి పెట్టు. ప్రజల జోలికి వస్తే ఖబడ్డార్' అని హెచ్చరించారు. శనివారం ఈటల మీడియాతో మాట్లాడుతూ తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అపార్ట్మెంట్లు కూలగొడతామంటూ హైడ్రా నోటీసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 'సీఎంకు, ఎమ్మెల్యేకు, మంత్రికి ఇక్కడికి వచ్చే ముఖం లేదు. దమ్ముంటే రమ్మని చెప్పండి. మేము హైడ్రాకు, చెరువుల పునరు ద్ధరణకు, మూసీలో కొబ్బరినీళ్ల వంటి నీళ్లను పారించడానికి వ్యతిరేకం కాదు. అన్ని అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చడానికి వ్యతిరేకం'అని స్పష్టంచేశారు. -
అన్నీ ఒకేసారి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పదవుల జాబితాలన్నీ ఒకేసారి విడుదల అవుతాయని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ పెద్దల కసరత్తు పూర్తయిందని, వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీ చేరాయని గాందీభవన్ వర్గాలు అంటున్నాయి. గత గురువారం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ అధిష్టానం పెద్దలకు ఇచ్చి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక కమిటీల బంతి అధిష్టానం కోర్టుకు చేరిందని, త్వరలోనే అధిష్టానం ఈ కమిటీలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ప్రభుత్వం ఏర్పాటయినప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్థానంలో బి.మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టి కూడా సంవత్సరం దాటిపోయింది. కానీ, ఇంతవరకు అటు టీపీసీసీ కమిటీలను కానీ, ఇటు క్షేత్రస్థాయి పదవులను కానీ భర్తీ చేయలేదు. టీపీసీసీ కార్యవర్గంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో పాటు కార్యవర్గ సభ్యుల నియామకం చేపట్టలేదు. ఎన్నికల సమయంలోనే నియమించిన ప్రచార కమిటీ కొనసాగుతోంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ పోస్టు ఖాళీ అయి దాదాపు మూడేళ్లు కావస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా గతంలో ఎప్పుడో నియమించిన వారే కొనసాగుతున్నారు. బ్లాక్, మండల, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కమిటీలన్నింటినీ నియమించేందుకు పలు దఫాలుగా ఇటు హైదరాబాద్‌లో, అటు ఢిల్లీ పెద్దల సమక్షంలో అనేక సార్లు చర్చలు జరిగాయి. కానీ, కమిటీల ప్రకటన వెలువడలేదు. కమిటీల కసరత్తు పూర్తయిందని, నేడో రేపో ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మారారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ రావడంతో కథ మళ్లీ మొదటికొచి్చంది. ఆమె ప్రాతిపదికలు మారిపోవడంతో పార్టీ కమిటీల నియామకానికి మళ్లీ కసరత్తు జరిగింది. ఈ కసరత్తు పూర్తి కావడంతో మూడు రోజుల క్రితమే ప్రతిపాదనలు ఢిల్లీకి చేరాయని సమాచారం. గాందీభవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి పార్టీ సంస్థాగత కమిటీలతో పాటు రాష్ట్ర పారీ్టలో కీలకమైన రాజకీయ వ్యవహారాల సలహా (పీఏసీ) కమిటీని కూడా పునరి్నయమించనున్నారు. జై బాపూ–జై సంవిధాన్ కమిటీ (ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ)ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు మీడియా సమన్వయం కోసం డెడికేటెడ్ కమిటీని ఏర్పాటు చేస్తారని, ఈ కమిటీకి ఎంపీని ఇన్చార్జిగా నియమిస్తారని తెలుస్తోంది. విష్ణునాథ్ స్థానంలో మరొకరు! మరో పక్క ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శిగా రాష్ట్రానికి కొత్త నేత రానున్నారు. ఇద్దరు కార్యదర్శుల్లో ఒకరైన విష్ణునాథ్ ఇటీవలే కేరళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరొక నేతను టీపీసీసీ కమిటీలతో పాటే నియమిస్తారని తెలుస్తోంది. -
ఒక ఓటుకు ఐదేళ్ల శిక్ష!
సత్తుపల్లి: ‘రాష్ట్రమంతా బర్బాద్ అయింది.. ఏమైనా ఉపాయం ఉంటే ఆలోచించండి అన్నా అని ఓ ఆటోడ్రైవర్ ఈ మధ్య సిగ్నల్ దగ్గర నన్ను గుర్తుపట్టి అడిగారు.. ఒక ఓటుకు ఐదేళ్ల శిక్ష.. తప్పు పార్టీకి ఓటేస్తే అనుభవించాలి కదా.. రీకాల్ వ్యవస్థ మనకు లేదు..’అని చెప్పానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు.ఇటువంటి దుర్మార్గులు అధికారంలోకి వస్తారని ప్రపంచ మేధావి బీఆర్ అంబేడ్కర్ ఊహించక పోవడంతోనే వారిని ఐదేళ్లూ భరించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్ వరకు పలువురు సీఎంలను చూసిన తాను, రేవంత్‌రెడ్డి వంటి దివాలాకోరు సీఎంను మాత్రం చూడలేదని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్తే తమ మాటలు నమ్మడం లేదని, దొంగల్లా చూస్తున్నారని, అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించండి ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేసీఆర్ మీటింగ్‌లు పెట్టి మరీ చెప్పారని.. మోసపోతే గోస పడతామని చెప్పినా ప్రజలు వినకపోవడం వల్లే మోసకారి ప్రభుత్వం వచ్చిందని కేటీఆర్ అన్నారు. ప్రజలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ పార్టీని భవిష్యత్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని సూచించారు. తొలుత పహల్గాం మృతులతో పాటు యుద్ధంలో అమరులైన జవాన్లకు కేటీఆర్ సహా నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబు బాటలోనే రేవంత్.. ఇదేం రాజకీయం!
ఆర్థిక పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యల్లో వాస్తవమున్నప్పటికీ ఆయన కూడా తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటే పట్టారేమో అనిపిస్తుంది. ఎన్నికల ముందు ఆకాశం మీ చేతుల్లోకి తెచ్చేస్తానన్న రీతిలో హామీలివ్వడం.. తీరా అధికారం చేపట్టిన తరువాత ఖజానా చూస్తే హామీల అమలుపై భయమేస్తోందని సన్నాయి నొక్కులు నొక్కడంలో చంద్రబాబు ఆరితేరిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్ కూడా అదే మాదిరిగా.. అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నట్లు అనిపిస్తోంది.నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంత బహిరంగంగా మాట్లాడడం సరికాకపోవచ్చు. వాస్తవాలు చెబుతున్న కారణంగా అంతా సర్దుకు పోతారని ఆయన భావన కావచ్చు. కాని దీనివల్ల రాష్ట్రం పరపతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు అప్పులు నిజంగానే పుట్టడం లేదా అంటే ఆంధ్రప్రదేశ్‌లో పదకుండు నెలల్లోనే రూ.1.5లక్షల కోట్ల అప్పు చేస్తే, తెలంగాణలో రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేశారు. అదనంగా అప్పులకు వెళితే ఇస్తున్నట్లు లేరు. దేనికైనా పరిమితులు ఉంటాయి. తోచినట్లు వాగ్దానాలు చేసి,అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అప్పులు పుట్టడం లేదని, బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయని అంటే ప్రజలు ఏమని అనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, తీరు చూస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమో అన్నట్లుగా పరిస్థితి దేశం ముందట ఉందని రేవంత్ అన్నారు.ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. దీనికంతటికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని రేవంత్ చెప్పవచ్చు. కాని అది పరిష్కారం కాదు. సరైన జవాబు కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే రాష్ట్ర అప్పులపై రేవంత్ కాని, ఇతర కాంగ్రెస్ నేతలు కాని అనేక విమర్శలు చేశారు. అయినా అధికారం రాబట్టుకోవడం కోసం ఎన్ని అసాధ్యమైన హామీలు ఇచ్చారో గుర్తులేదా? ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండానే వాగ్దానం చేశారా? అలా చేస్తే అది బాధ్యతారాహిత్యం కాదా? అదేమంటే రేవంత్ ఇచ్చిన సమాధానం చూడండి. ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి ఇదెంత సంసారం. చక్కదిద్దవచ్చని అనుకున్నానని ఆయన చెప్పారు. తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు.. రెండు లక్షల కోట్లే ఆదాయం, అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఉంది అని ఆయన వివరిస్తున్నారు.సరిగ్గా చంద్రబాబు కూడా ఏపీలో ఇలాగే మాట్లాడారు. తనకు ఎన్నికల ముందు అన్నీ ఇవ్వవచ్చని అనుకున్నానని, కాని లోపలికి వెళ్లి చూస్తే ఏమీ లేదని, ఖజానా ఖాళీగా కనబడస్తా ఉందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేసిన చంద్రబాబు తీరా బడ్జెట్లో రూ. ఆరున్నర లక్షల కోట్లే ఉందని అంగీకరించారు. అయినా హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టడానికి ఈ కబుర్లు చెబుతున్నారన్న సంగతి ఏపీ ప్రజలకు అర్థమైంది. అదే ధోరణిలో రేవంత్ కూడా ఎన్నికలకు ముందు వంద రోజులలో అన్ని హామీలు చేసి చూపిస్తామని, రైతులకు రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఎవరైనా అప్పు చేయకపోతే బ్యాంకులకు వెళ్లి అప్పు తీసుకోండని చెప్పారా? లేదా? అది బాధ్యతారాహిత్యం కాదా? ఇప్పుడేమో తాను 18 గంటలు కష్టపడుతున్నానని, ఒక్క రోజైనా, ఒక్క గంట సెలవైనా తీసుకోలేదని సానుభూతి కోసం మాట్లాడుతున్నారు. నిజానికి ఏ సీఎం అయినా 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే ఆ ప్రభుత్వం పద్దతిగా లేదని అర్థం.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. మిగిలినవారిని పని చేయనివ్వకుండా తానే పని చేస్తున్నానని చెప్పుకోవడానికి ఇలాంటి మాటలు పనికి వస్తాయి తప్ప జనానికి ఏమి ఉపయోగం? ఇది కూడా చంద్రబాబు తరహా మాటే.ఆయన కూడా తాను ఎంతలా కష్టపడుతున్నది పదే, పదే జనానికి చెబుతుంటారు. రేవంత్ కొత్తగా సీఎం అయి ఉండవచ్చు.ఆయన కొన్ని వాగ్దానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయినా అన్నిటిని అమలు చేయడం కష్టం కనుక ఈ కొత్తరాగం ఎత్తుకున్నారు. అప్పులు, వాయిదాలకే రూ.7500 కోట్లు అవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు రేవంత్‌కు మద్దతుగా మాట్లాడుతున్నా, అవి అంత కన్విన్సింగా కనిపించవు. ఏ ప్రభుత్వం ఉన్నా, రుణాలు చెల్లించవలసిందే కదా! ఒక్కసారి గతానికి వెళితే చంద్రబాబు నాయడు 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలిస్తేనే కిలో రెండు రూపాయల బియ్యం, మద్య నిషేధం, మొదలైనవి కొనసాగుతాయని ప్రచారం చేశారు.ఎన్నికలు అయ్యాక మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, మార్పులు చేయాలని, బియ్యం రేట్లు పెంచాలని, మద్య నిషేధం ఎత్తివేయాలంటూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు సాగించారు. ప్రతి ఎన్నికకు ముందు ఇదే తతంగం ఆయన సాగిస్తుంటారు. 2014లో రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని, బ్యాంకులలో తనఖాలో ఉన్న రైతుల భార్యల బంగారం కూడా విడిపిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఏదో అరకొర చేసి చేతులెత్తేశారు. 2024లో కూడా సూపర్ సిక్స్ అంటూ మరోసారి జనాన్ని మభ్య పెట్టడానికి వెనుకాడలేదు. ఈ రకంగా గురు, శిష్యులైన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే బాటలో పయనించడం విశేషం.ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అంత సహేతుకంగా అనిపించవు. తమ డిమాండ్లు నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఎవరిపై మీ సమరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఏమి ప్రయోజనం? తెలంగాణ రాష్ట్రం దివాళా తీయడానికి ఉద్యోగులు బాధ్యులు అవుతారా? లేక పాలన చేస్తున్న నేతలా?‘‘నన్ను కోసినా రూపాయి రాదు..ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు..ప్రజా ప్రతినిధులు,, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం’’ అంటూ సూత్రాలు చెబితే ఏమి లాభం. రేవంత్ ఒక్కసారి కాంగ్రెస్ మానిఫెస్టోని తిరిగి చదువుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని రకాల హామీలు ఇచ్చింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ చదివి వినిపించారు. వాటన్నిటిని ఏ బాధ్యతతో చేశారు? ఇప్పుడు వాటిని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అడిగితే ‘‘ఎవరిపై మీ సమరం?’’ అంటే వారేమి జవాబు ఇస్తారు! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, తదితర వాగ్దానాలు చేశారా? లేదా? రేవంత్ తాను అన్ని నిజాలే చెప్పినట్లు అనుకోవచ్చు.కాని అది చెప్పిన తీరు బాగోలేదు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని అంతరంగికంగా చర్చలు జరిపి వారికి నచ్చ చెప్పి ఉండవచ్చు. ఫలానా సమయానికి తాను హామీలు అమలు చేయగలుగుతామని చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా ఇంత బహిరంగంగా వేరే కార్యక్రమంలో ఉద్యోగులను బెదిరించే రీతిలో మాట్లాడడం వల్ల ఆయనకే నష్టం. రేవంత్ తీరువల్ల రాష్ట్ర పరువు పోయిందని బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ తాను నిజాలే మాట్లాడుతున్నానులే అనుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సీఎంకు చేతకావడం లేదని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్‌లో కూడా దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళతాయి. కుల గణన ద్వారా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయిందని ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ దివాళా తీసిందని చెప్పడం ద్వారా దేశానికి ఏమి సంకేతం ఇచ్చినట్లయింది? అసలే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో రేటింగ్ తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డే దానిని మరింత తగ్గించుకున్నట్లుగా ఉంది. ఎన్నికలకు ముందు పొలిటికల్ సైన్స్, ఎన్నికల తర్వాత ఎకనామిక్స్ చెబితే జనం నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘అప్పులు చెల్లింపుల కోసం నెలకు రూ. 6 వేల కోట్లు కడుతున్నాం’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. ఈరోజు(మంగళవాళం) బేగంపేట్ లో మీడియాతో మాట్లాడిన సీతక్క.. గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పుగా మార్చిందని మండిపడ్డారు. కేసీఆర్ అప్పు.. తెలంగాణ భవిష్యత్ కు ముప్పుగా దాపురించిందని ధ్వజమెత్తారు.‘కేసీఆర్ నిర్వహాకం వల్ల నెలకు రూ. 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుంది. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే.. పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి సత్తా నిరూపించుకోవాలి. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ది. 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది మీరు కాదా?, ఉపాద్యాయ, ఉద్యోగ నాయకుల ఇంటి తలుపులు పగుల గొట్టింది ఎవరు కేటీఆర్?. ఎందరో ఉద్యమకారులను అవమాన పరిచి బయటకు పంపిన చరిత్ర మీది. అప్పులు, అమ్మకాలు తప్ప మీరు చేసిన అభివృద్ది శూన్యం. మీరు చేసిన అభివృద్ది ఒక గాలి బుడగ అని ఎన్నికల్లో ప్రజలే తేల్చారు. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నాం’ అని మంత్రి సీతక్క తెలిపారు. -
‘సీఎం రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదు’
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ కు పరిపాలను చేతకాకపోవడం వల్లే నిస్పృహతో రేవంత్ ఈ మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ లక్ష కోట్ల అవినీతి డబ్బుకు కక్కిస్తానని చెప్పిన రేవంత్.. ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు.‘తెలంగాణకు పరపతి లేదని ఎలా మాట్లాడుతారు?, కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే తెలంగాణ లక్షన్నర కోట్ల రూపాయల అప్పు తెచ్చుకుంది. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని రక్షణశాఖ సహాయం మంత్రిని కలిశాను. తెలంగాణలో మూడు సైనిక్ స్కూల్స్ తీసుకొచ్చి బాధ్యత నాదే. రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకరించి... భూమి ఇవ్వాలి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ ఇస్తామన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. తెలంగాణలో 25 వేల మంది విద్యార్థులు సైనిక్ స్కూల్స్ కోసం పరీక్షలు రాస్తే... తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ లేకపోవడం దురదృష్టకరం’ అని రఘునందన్ రావు విమర్శించారు. -
సీఎం రేవంత్ చేతులెత్తేశారా?.. బండి సంజయ్ కౌంటర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థితేంటి? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి అధైర్యం నింపుతారా? అంటూ నిలదీశారు. రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని ఎన్నికలకు ముందే తెలుసా కదా?. అప్పుల గురించి తెలిసే హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు.ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ రాసిచ్చారు. రేవంత్ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయింది’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.మంగళవారం.. ఎల్లారెడ్డిపేటలో పర్యటించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగస్థులు, ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏలకు డబ్బుల్లేవంటున్నాడు సీఎం. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అన్నీ హుళక్కే ఇక. ఓట్లు వేసి గెలిపించారు ఇక మీ కర్మ. మేమైతే ఏం చేయలేమని ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పిండు...కేసీఆర్ అప్పులు చేశాడని చెప్పిన మీరు... తాము వస్తే అంతా బాగుంటుందని మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చారు. రేపట్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం. కేంద్ర మంత్రులు, ప్రధాని వచ్చినప్పుడు సాయం చేస్తున్నారని మాట్లాడే కాంగ్రెస్ నాయకులే.. మళ్లీ ఆ తర్వాత కేంద్రం ఏం చేయడం లేదని రాజకీయాలు చేస్తారు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. -
‘ఆ చావులకు మీరేం సమాధానం చెబుతారు?’
పెద్దపల్లి: మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదనే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ ఎంపీ బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు రామగుండంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటని సంజయ్ ప్రశ్నించారు. ఆ చావులకు మీరేం సమాధానం చెబుతారంటూ బండి సంజయ్ ఎదురు ప్రశ్నించారు.‘కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోంది. మావోయిస్టులు దశాబ్దాలుగా అమాయకులను కాల్చి చంపిన సంగతి గుర్తు లేదా?, మావోయిస్టుల సానుభూతి పరులు సాధించిందేంటి?, మావోయిస్టులు ఎవరున్నా తుపాకీ వీడి లొంగిపావాల్సిందే.. జన జీవన స్రవంతిలో కలవాల్సిందే. పౌర హక్కుల సంఘం నేతలారా.. నక్సల్స్ నచ్చజెప్పండి’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.ఇక తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదన్నారు బండి సంజయ్. కేవలం సర్వే మాత్రమే జరిగిందన్నారు. ఇక్కడ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదన్నారు. ప్రతి ఇంటికి కచ్చితంగా వెళ్లి నిర్వహించేది కులగణన అని అన్నారు. జనగణన మాదిరిగానే మోదీ ప్రభుత్వం కులగణన చేస్తుందన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామన్నారు బండి సంజయ్. -
‘కవితకు తెలియకుండానే మనసులో మాట బయటకు వచ్చింది’
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సామాజిక తెలంగాణ అంటూ కొత్త రాగం తీసుకుందని ధ్వజమెత్తారు సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికారం పోయిన తర్వాత చాలా పెద్ద పెద్ద మాటలు కవిత మాట్లాడుతుంది. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకులేవా?, మీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా?, అధికారం పోగానే సామాజిక తెలంగాణ గుర్తుకు వచ్చిందా?’ అంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి.రాహుల్ గాంధీ నాయకత్వంలో, సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక ప్రజా పరిపాలన కొనసాగుతుందని, తెలంగాణలో గొంతు విప్పి మాట్లాడే స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. ఆ స్వేచ్ఛలోనే కవిత గొంతు కూడా మాట్లాడుతుందన్నారు. కొత్త కొత్త రాగాలు ఎంచుకుని, నటించడం కవిత కుటుంబానికే సాధ్యమని, కేసీఆర్ ది నటనతో కూడిన పాలన అని, కాంగ్రెస్ ప్రభుత్వంది ప్రజా పాలన అని స్పష్టం చేశారు.‘ఎవరికైనా నష్టం జరిగిదే... స్వేచ్ఛ గా ఇందిరాపార్కు దగ్గర నిరసన చేసే స్వేచ్ఛ కాంగ్రెస్ ఇచ్చింది. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు. అందుకే మా ప్రభుత్వం స్వేచ్ఛ ను ఇచ్చింది. ఇందిరాపార్కు మాత్రమే కాదు... ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు వెల్లినా నిరసన చేసే స్వేచ్ఛ ఇచ్చింది. సామాజిక తెలంగాణ కోరుకుంటే.. కులగణన చేసి సామాజిక తెలంగాణ సాదిస్తున్నాం. కొత్త సెలబస్ తో తెలంగాణ ప్రజలను మోసం చేసేలా మీ ప్రకటన ఉంది.బిఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఇంకో పదేళ్లు ఉంటుంది. బిఆర్ఎస్ అధికారంలోకి తెచ్చుకుని బందీలుగా ఉండాలని ఎవరూ అనుకోరు.కేసీఆర్ పదేళ్ల లో సామాజిక తెలంగాణ కోసం పనిచేయలేదని కవిత చెప్పకనే చెప్పింది.కవితకు తెలియకుండానే మనసులో మాట బయటకు వచ్చింది’ అని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. -
‘టైమ్ పాస్ మీటింగ్‌లతో అలసిపోయాం’
హైదరాబాద్: ఇటీవల రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీకే చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి ధ్వజమెత్తారు. ఇప్పటికే టైమ్ పాస్ మీటింగ్ లతో అలసిపోయామని, తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని త్వరగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంచితే, రేపు( ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కులగణనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ తరుణంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్యనీయాంశంగా మారాయి.కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేకే అధికారంలోకి రాలేదని గత నెలలో రాజాసింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కచ్చితంగా బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగించిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా స్పందించింది. దీనిలో రాజాసింగ్ ఒకవైపు బీజేపీ అధికారంలోకి వస్తుందని అంటూనే , రాష్ట్రంలోని నాయకత్వం సరిగా లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు.హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ గౌతంరావును అభ్యర్థిత్వాన్ని తొలుత నిరాకరించారు రాజాసింగ్. అయితే కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ చొరవతో రాజాసింగ్ కాస్త దిగివచ్చారు. పార్టీ లైన్ లోనే పనిచేస్తానని బండి సంజయ్ కు హామీ ఇచ్చారు. అయితే మరొకసారి రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటో కీలక నేతలకు అర్థం కావడం లేదు. -
రేవంత్ సర్కార్‌కు కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: కుల గణనపై చర్చకు సిద్ధమంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ సర్కార్ చేసింది కుల గణన కాదని.. కుల సర్వే మాత్రమే చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ సర్వే కూడా తూతూ మంత్రంగా చేశారు. మేము ఎప్పుడు కుల గణనను వ్యతిరేకించలేదు. బీసీలకి న్యాయం జరిగేలా సరైన గణన చేయాలని కోరాం’ అని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.‘‘ముస్లింలను బీసీలలో కలిపి అసలైన బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పాం. దేశంలో స్వాతంత్య్రం వచ్చాక కుల గణన చేస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీది. 90 శాతం జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనలో మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో ఎన్డీయే హయాంలో రోడ్ల కనెక్టివిటీ బాగా పెరిగింది. తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాల్లో రోడ్ల నిర్మాణం జరిగింది. హైవే రోడ్లకు కనెక్టివిటీ చేయడం జరిగింది. 2014 తెలంగాణలో 2500 కిలో మీటర్ల జాతీయ రహదారులుంటే ఇవాళ 5200 కిలోమీటర్ల జాతీయ రహదారులు పెరిగాయి’’ అని కిషన్‌రెడ్డి వివరించారు.‘‘కేంద్ర ప్రభుత్వం 1 లక్ష 20 కోట్ల నిధులను కేవలం రోడ్ల నిర్మాణంపై ఖర్చు చేస్తోంది. హైదరాబాద్‌కు అన్ని వైపుల అత్యాధునికంగా, అన్ని సౌకర్యాలతో జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్, శ్రీశైలం మధ్య ఫోన్ లైన్ ఎలివేటెడ్ హైవే ప్రతిపాదనలో ఉంది. భూసేకరణ కాకపోవడం వల్ల రహదారుల నిర్మాణం నత్తనడకన జరుగుతున్నాయి. జాతీయ రహదారులకు కావలసిన ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా పనులు పూర్తవుతాయి. 6వేల కోట్ల నిధులతో తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ క్యారిడార్ రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి.5 కారిడార్లకు లక్ష కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో రూ. 5416 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్ రెండు చోట్ల వివిధ జాతీయ రహదారులకు భూమి పూజ చేయనున్నారు. ఆదిలాబాద్‌లో కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద 5 ప్రాజెక్ట్ లు, హైదరాబాద్‌లో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లై ఓవర్, అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తారు. అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగే సభలో ప్రసంగిస్తారు’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు. -
‘కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదు’
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ తన దగ్గర పెట్టుకొని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదని, స్వేచ్చగా రివ్యూ చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు పొంగులేటి. ఈరోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ చేసిన పొంగులేటి.. ‘ ఆనాడు మంత్రులను కేసీఆర్ పని చేయనియ్యలేదు. భూ భారతి వల్ల 70శాతం ప్రజలకు ఉపయోగం జరిగినా మేము సక్సెస్ అయినట్లే. భూ భారతిలో కొత్త సాఫ్ట్ వేర్ రాబోతోంది. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరగదు. జరగనివ్వను. త్వరలోనే రాష్ట్రంలో సర్వేయర్లు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. జూన్ లో సర్వే మ్యాప్ పైలెట్ ప్రాజక్టు ద్వారా రిజస్ట్రేషన్లు చేస్తాం. ఆరువేల దరఖాస్తులు సర్వేకు వచ్చాయి. భర్తీ చేయబోతున్నాం. ప్రైవేట్ సర్వేయర్లతో భూముల సర్వే జరుగుతుంది.. ప్రభుత్వ పర్యవేక్షణ సైతం ఉంటుంది’ అని అన్నారు. -
‘ఇలంబర్తికి వచ్చింది ప్రమోషన్.. డిమోషన్ కాదు’
హైదరాబాద్: తన పరిధిలో ఉన్న శాఖల్లో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. దీనికి సంబంధించి తన పరిధిలోని అన్ని డిపార్ట్ మెంట్లలో విచారణ చేసుకోవచ్చని సవాల్ చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన పొన్నం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించారు. చిన్నస్థాయి నుంచి మంత్రిగా ఎదిగానని, తనపై వచ్చిన అవినీతి మరకలను నిరూప్తిస్తే తాను దేనికైనా సిద్ధమేనన్నారు.తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదని, తన దగ్గరున్న ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కింది స్థాయి అధికారి వరకూ మంచి సంబంధాలున్నాయన్నారు. ఇలంబర్తికి తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అధికారుల బదిలీలు ప్రభుత్వంలో సర్వసాధారణంగా జరుగుతుందన్నారు. ఇలంబర్తికి వచ్చింది ప్రమోషన్.. డిమోషన్ కాదన్నారు. ఇదిలా ఉంటే, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి బదిలీ అయిన సంగతి తెలిసిందే. కొత్త కమిషనర్ గా ఆర్వీ కర్ణన్ ను నియమించింది ప్రభుత్వం. 2024 జూన్ లో రోనాల్డ్ రోస్ ని పక్కన పెట్టి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అమ్రాపాలి నియమించింది ప్రభుత్వం. ఐదు నెలల పాటు పనిచేయగానే అమ్రాపాలి ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో 2024 అక్టోబర్ లో బల్దియా బాస్ గా ఇలంబర్తిని నియమించారు. ఆరు నెలలు పని చేయగానే ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఇలంబర్తిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్( MAUD) సెక్రెటరీగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ పై అవినీతి ఆరోపణలు రావడం, దానికి ఇలంబర్తి అంశాన్ని లింకు పెట్టడంతో వివాదం పెద్దదిగా మారింది. దీనిపై పొన్నం ప్రభాకర్ వివరణ ఇవ్వడమే కాకుండా అవినీతిని నిరూపించాలంటూ సవాల్ చేశారు. -
తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అడ్డంకిగా మారారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణనను తప్పుల తడక అనడం ఈ ఇద్దరు నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని గురువారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. బీఆర్ఎస్తో దోస్తీ కట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడం వీరికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాహుల్ గాంధీ సంకల్పం సిద్ధించిందని, రాహుల్ ఆలోచన మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందని పేర్కొన్నారు. శాసనసభలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల సాక్షిగా ఏకగ్రీవ తీర్మానంతో బీసీల కులగణనకు చట్టబద్ధత కల్పించామని పేర్కొన్నారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసేలా పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు.బీసీ బిల్లు చట్టబద్ధత కోసం ప్రధాని మోదీకి లేఖ రాసే దమ్ము కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర మంత్రులమన్న విషయం మరిచి మాట్లాడటం వారి అహంకారానికి పరాకాష్ట అని మహేశ్‌గౌడ్ దుయ్యబట్టారు. పారదర్శక సర్వేపై తప్పుడు ఆరోపణలు చేయడానికి బీసీ బిడ్డగా బండి సంజయ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కేంద్రం జనగణనతో పాటు కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ విజయం అని, కేంద్రం దేశవ్యాప్తంగా కులగణన ఎప్పుడు నిర్వహిస్తుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. చరిత్రాత్మక కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయాలతో దేశానికీ ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని ఆయన అన్నారు. -
తెలంగాణలో చేసింది కుల సర్వేనే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం నిర్వహించింది కులగణన కాదని.. కుల సర్వే మాత్రమేనని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆ సర్వే ను కూడా తూతూమంత్రంగానే నిర్వహించారని ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఆయ న మీడి యాతో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభు త్వం సర్వే వివరాలను ఒకసారి పబ్లిష్ చేసి, లోపాలుంటే మరోసారి సర్వే చేసింది. ఇష్టం వచ్చినట్లు సర్వే చేశారు తప్ప.. అందులో శాస్త్రీయత లేదు. అది బీసీ వ్యతిరేక సర్వే. ఈ విషయం రాహుల్‌గాం«దీకి అర్థం కాలేదు.తెలంగాణ, కర్ణాటకలో చేపట్టిన కులగణన హడావుడిగా, ఏదో సాధించామని చెప్పుకునేందుకు చేశారు. ఇందులో చిత్తశుద్ధి లేదు, ఇది కులగణన కూడా కాదు. కులాలకు సంబంధించిన సర్వే మాత్రమే. తెలంగాణలో ఉన్న రాంగ్ రోల్ మోడల్ మాకు అవసరం లేదు. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి సమగ్రంగా జనగణన చేస్తాం. శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరుగుతుంది. మేము చేపట్టబోయే కులగణనలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలను బీసీల్లో చేర్చం. మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదు’అని స్పష్టం చేశారు. ఈ కులగణన చరిత్రపుటల్లో నిలిచిపోతుందన్నారు. రాహుల్‌గాంధీ మాటలు సిగ్గుచేటు తన ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ రాహుల్‌గాంధీ చెప్పడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డిలకు భయపడి తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ‘ఎద్దులబండి కింద నడుస్తున్న కుక్క.. మొత్తం బండిని తానే మోస్తున్నానని అనుకుంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా. తాము చెప్పినట్లే ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పుకుంటోంది. ఇది హాస్యాస్పదం’అని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుకు కట్టుబడే కులగణన ఉంటుందని తెలిపారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజలను మతం పేరుతో విడగొడుతున్న కాంగ్రెస్ పార్టీ.. కులాల పేరుతోనూ సమాజాన్ని విచి్ఛన్నం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ‘కులగణన చేపట్టేందుకు సెన్సెస్ యాక్ట్ 1948లో సవరణ తీసుకొచ్చి ‘కులం’అనే పదాన్ని ఓ పారామీటర్‌గా చేర్చాలి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ సవరణ తీసుకొచి్చన తర్వాతే జనగణనపై ముందుకెళ్తాం. 2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంది’అని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పారీ్టకి ఉన్నవే మూడు రాష్ట్రాలని, అవి కూడా తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివని ఎద్దేవా చేశారు. -
ఏడాదిలోగా చేయాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కులగణన విధివిధానాలేమిటో కేంద్రం తొలుత స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రహస్యంగా కాకుండా పార్లమెంటరీ వ్యవస్థలో అందర్నీ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని కోరారు. దీనిపై తక్షణమే మంత్రివర్గ ఉప సంఘాన్ని, నిపుణులతో కూడిన అధికారిక కమిటీని నియమించాలని సూచించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తూతూమంత్రంగా కాకుండా శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని, ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, హర్కర వేణుగోపాల్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజ్‌ఠాకూర్, బీర్ల ఐలయ్య వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు సీఎం మాటల్లోనే.. రాహుల్ ప్రతిపాదనను గౌరవించడం గొప్పతనం మా ఒత్తిడికి తలొగ్గి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. ఒకవేళ పహల్గాం దాడి నుంచి పక్కదారి పట్టించడానికో, బిహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నా సరే. దేశ వ్యాప్తంగా బలహీనవర్గాలకు ప్రయోజనం కలుగుతున్నప్పుడు.. ప్రభుత్వపరంగా, రాజకీయంగా ఇందుకు పూర్తిగా సహకరిస్తాం. మా అనుభవాలను పంచుకోవడానికి, కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్‌జోడో యాత్రలో రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో కులగణన చేపడ్తామని, కేంద్రంలో అధికారంలోకి వస్తే జనగణనతో పాటు కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్‌గాంధీ ప్రతిపాదనను మోదీ గౌరవించడం గొప్పతనం. అయితే ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తారో తేదీలను ప్రధాని ప్రకటించాలి. కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది. దీనివల్ల సంక్షేమ పథకాలు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆయా కులాలకు కచ్చితంగా అందించడానికి వీలవుతుంది. దాదాపు వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సమగ్ర కులగణన చేశాం. రాహుల్‌గాంధీ సూచనలు తీసుకుని ఎలాంటి వివాదాలు, తప్పులు లేకుండా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఇతర స్టేక్ హోల్డర్లందరినీ భాగస్వాములను చేస్తూ.. 57 ప్రశ్నలతో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా సమగ్రంగా వివరాలు సేకరించి నివేదిక రూపొందించాం. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండేలా భద్రత కల్పించాం. దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం. సీఎస్ నుంచి ఎన్యూమరేటర్ వరకు, మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ ఇలా.. 1.5 లక్షల మందితో ఈ ప్రక్రియ నిర్వహించాం. రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నాం.. అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేశాం. దేశంలో జనగణనతో పాటు కులగణన తక్షణమే చేపట్టాలి అనేది మొదటిది. రెండోది బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపించాం. ఇదే డిమాండ్‌తో కుల సంఘాల మద్దతుతో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ఒకరోజు ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. అయినా కులగణన చేయబోమంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన వారు ఇప్పుడు అంగీకరించడానికి మా ఒత్తిడే ప్రధాన కారణం. ఏది ఏమైనా కేంద్రం నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నాం. అభినందిస్తున్నాం. పారదర్శకంగా ముందుకు వెళ్లాలి ఈ ప్రక్రియ అమలులో సవాళ్లు, సమస్యలను ఏ విధంగా అధిగమిస్తారో వెల్లడించాలి. కేంద్రం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ముందుకు వెళ్లాలి. అన్ని రాష్ట్రాల్లో సమాచార సేకరణ చేయాలి. మేం అందర్నీ ఇందులో భాగస్వాములను చేశాం. కులగణన పూర్తి చేసి ఇప్పుడు దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచింది. మేము కుల గణన చేసినప్పుడు ఎదురైన సవాళ్లను కేంద్రంతో పంచుకోవడానికికి సిద్ధం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది మా సంకల్పం. రాహల్‌గాంధీ ఆలోచనను అమలు చేసే క్రమంలో ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా నివేదికను ఇప్పటికే ఢిల్లీకి పంపించాం. ఏ సమాచారం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధమే. ఇక్కడకు వచి్చనా సరే.. మమ్మల్ని ఢిల్లీ రమ్మనా సరే.. ఒక మెట్టు దిగడానికి మేము రెడీ. పకడ్బందీగా చేసే ఆలోచన కన్పించడం లేదు మాది రాజకీయ ఉద్దేశంతో చేసిన కుల గణన అంటూ విమర్శలు చేసే నాయకులను ఒకే ప్రశ్న అడుగుతున్నా. 11 సంవత్సరాలుగా కేంద్రంలో, 16 రాష్ట్రాల్లో పాలనలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా కుల గణన చేసి ఆదర్శంగా నిలిచి ఉంటే.. మేము తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకునే అవకాశం వచ్చేది కాదు. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృత వారి (బీజేపీ) మాటల్లో కనిపిస్తోంది. పకడ్బందీగా కులగణన, జనగణన చేయాలన్న ఆలోచన వారిలో కనిపించడం లేదు. 2021లో జనగణన చేయకుండా వాయిదా వేశారు. మోదీ.. రేవంత్‌రెడ్డి విధానాలను అనుసరిస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకులు కక్కలేక మింగలేకపోతున్నారు. రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు.. ఒక రాష్ట్రంలో బీసీ ఉండి, మరో రాష్ట్రంలో ఓసీగా ఉన్న కులాలకు సంబంధించి కొందరు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపినప్పుడు సమాధానం లభిస్తుంది. రాష్ట్ర యూనిట్‌గా రిజర్వేషన్లు అమలవుతాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు దీనితో సంబంధం లేదు. ఆ ప్రక్రియ సాగుతోంది. మాకంటే మెరుగ్గా వారు కులగణన చేస్తే మంచిదే. ఆస్తులు, అప్పులు, పొలాల విషయంలో అబద్ధం చెప్పొచ్చు. కానీ కులం విషయంలో ఎవరూ అబద్ధం చెప్పరు. కులాల లెక్క పక్కాగా తేలితే సంక్షేమ పథకాల అమలు సులభం. వీటికి కేంద్రం డేటానే ప్రామాణికం. అది లేనప్పుడు మేము చేసిన సర్వే డేటానే ప్రామాణికం. తెలంగాణ సేకరించిన సమాచారం దేశానికి రోల్‌మోడల్. 400 సీట్లు వచ్చి ఉంటే రిజర్వేషన్లు ఎత్తేసేవారు బీజేపీకి గత ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. రిజర్వేషన్లు ఎత్తేసేవారు. ఇప్పుడు ఈ కులగణన చేపట్టేవారు కూడా కాదు. ఎన్నికల సమయంలో మేముప్రజలను అప్రమత్తం చేయడం వల్ల వారికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లకు పరిమితం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం కారణంగానే వారి ఎజెండాను పూర్తిగా అమలు చేయలేకపోతున్నారు. రాజకీయంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే కులగణనకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతోందో ఈ బచ్చాలకు తెలియదు ఢిల్లీలో ఏమి జరుగుతోందో గల్లీలో తిరిగే కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బచ్చాలకు తెలియదు. నరేంద్రమోదీ ఎవరిని ఫాలో అవుతున్నారు. ఏమి ఆలోచిస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు. ఎవరి సలహా తీసుకుంటున్నారు. ఈ గల్లీల్లో తిరిగే పిల్లలకు తెలియదు. వారి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచడాన్ని మాత్రమే సుప్రీంకోర్టు తప్పుపట్టింది తప్ప.. 50 శాతం సీలింగ్‌ను కాదు. ఈడబ్ల్యూఎస్‌తో రిజర్వేషన్లు 60 శాతానికి చేరాయి. నమోదు చేసుకోనివారు లెక్కల్లో లేనట్లే.. కులగణనలో తమ పేర్లు నమోదు చేసుకోని వారు లెక్కలో లేనట్లే. కేసీఆర్ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఒక మాట అన్నారు. ‘ఉన్నోడే ఉన్నట్లు ..లేనోడు పోయినట్లే అని..’. వారికి ఆ స్పష్టత ఉంది. మా పార్టీ, ప్రభుత్వం హింసకు (ఆపరేషన్ కగార్‌పై మాట్లాడుతూ) వ్యతిరేకం. అది రాజ్యహింస అయినా, వ్యక్తులు చేసినా.. సంఘాలు చేసినా..తప్పే. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. -
‘జాతీయ కులగణన వ్యతిరేకి కాంగ్రెస్’
హైదరాబాద్: జాతీయ కులగణనకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి అంటూ కేంద్ర హెంశాఖ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కులగణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తమ ఘనతే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు బండి సంజయ్ చురకలంటించారు. ‘కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో జనాభా లెక్కల్లో కులగణనను చేర్చకపోవడమే నిదర్శనం. కులగణన చేయాలంటూ అన్ని పార్టీలు కోరినా పట్టించుకోని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్సే. మోదీ సర్కార్ నిర్ణయం కాంగ్రెస్ ఘనతేనని చెప్పడం సిగ్గుచేటు. అదే నిజమైతే డూప్లికేట్ గాంధీల ఏలుబడిలో కులగణన ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి. దేశవ్యాప్త కులగణన మోదీ సర్కార్ ఘనతే. రాష్ట్ర ప్రభుత్వ కులగణన సర్వే అంతా తప్పుల తడకే. కేసీఆర్ సమగ్ర సర్వేకు, రేవంత్ సర్కార్ సర్వేకు పొంతన లేకపోవడమే నిదర్శనం. కేంద్ర కులగణన అత్యంత శాస్త్రీయమైది. కులాల వారీగా జనాభా ఎంతో తేలిపోతోంది. జనాభా ఆధారంగా రిజర్వేషన్లలో న్యాయం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించండి’ అని బండి సంజయ్ కోరారు. -
‘ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం’
హైదరాబాద్: కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో కులగణనపై నిర్ణయం తీసుకున్న అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు.‘దేశ చరిత్రలో మొదటిసారిగా కులగణన నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ. కుల గణన తో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించడం జరిగింది’ అని ఆయన అన్నారు.కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాందేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ‘భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా కులగణన జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి కులగణన చేశారు. రాహుల్ గాంధీ పోరాటం.. రేవంత్ రెడ్డి ఆలోచన విధానం వల్లనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం.. రాహుల్ గాంధీ సాధించిన విజయం. దేశ వ్యాప్తం గా ఉన్న బడుగు బలహీన వర్గాల విజయం ఇది. రాహుల్ గాంధీ పోరాటానికి భయపడే బీజేపీ ప్రభుత్వం కులగణన కోసం ముందుకు వచ్చింది. రాహుల్ , రేవంత్ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది. బీసీ బిడ్డ కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి కులగణనకు ముందుకు వచ్చారు. 56.36 శాతం బీసీలు ఉన్నారని తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క తీశారు.బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెడితే నేను బలపర్చాను.. అది నా అదృష్టం. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం. జంతర్ మంతర్ ధర్నా కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. మా ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ ఆ నాడు మద్దతు ఇవ్వలేదు. గతంలో బీఆర్ఎస్ తన రాజకీయ అవసరాల కోసం సమగ్ర కుటుంబ సర్వే చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి దేశానికి మార్గదర్శనం చేశాడు. తెలంగాణ బీసీ కులగణనకు దిక్సూచిగా మారింది. కులగణన చేయకపోతే బడుగు బలహీన వర్గాల ఆగ్రహం తప్పదని బీజేపీకి అర్థమైంది. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు వారి వాటా వారికి అందాల్సిందే. జనగణన లో కులగణన పకడ్బందీగా నిర్వహించి రిజర్వేషన్లను చట్టబద్దం చేయాలి’ అని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలని, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఉత్త విమర్శలు చేస్తూ కాలయాపన చేయడం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీమహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడు. ఆయన జయంతి రోజున పదోతరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషం. పరీక్షలు పాసైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవన్న. బసవేశ్వర స్ఫూర్తితోనే పంచాయతీ రాజ్ పార్లమెంటరీ వ్యవస్థను మనం తెచ్చుకున్నాం. ప్రతీ మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలను ఎత్తి చూపేందుకే ప్రతిపక్షం అనే వ్యవస్థ ఉంది. మొన్న ఒకాయన(కేసీఆర్‌ను ఉద్దేశించి..) వరంగల్ లో సభ పెట్టి కాంగ్రెస్‌ను విమర్శించిండు. వాళ్లు రజతోత్సవాలు , విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. వరంగల్ సభలో మేం చేసిన మంచిని అభినందించి ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు ఆయన్ను అభినందించే వాళ్లు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?. ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు.. ఇది ఏ చట్టంలో ఉంది?. ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారు. మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేయకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారుఫామ్ హౌజ్‌లో పడుకుని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు?. సంక్షేమ పథకాలు ఆగిపోయాయని ఆయన మాట్లాడిండు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వీటిలో ఏది ఆగిపోయింది?. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం.. ఇవేవీ మీకు కనిపించడంలేదా?. మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలి. కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరితప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజలు విజ్ఞులు.. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కేసీఆర్‌కు లేదు. పదేళ్లు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ చేద్దాం రండి. ఏ అంశంపైన అయినా సరే చర్చకు సిద్ధం. కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, మేం ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో దేనిపై చర్చ చేద్దాం చెప్పండి.. కేసీఆర్. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం.కేసీఆర్ మాటల్లో.. కళ్ళల్లో విషం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ విలన్ ఎలా అవుతుంది?. పదేళ్లు దోచుకున్న మీకు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదు. ఆగమైంది తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కేసీఆర్ వరంగల్ వెళ్లారు. ఆయన వరంగల్ వెళ్లి పాపాలు కడిగేసుకున్నానుకుంటున్నారు.. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు. వరంగల్ సభలో నా పేరు కూడా పలకలేకపోయారుబసవేశ్వరుడి స్ఫూర్తితో ‘రాష్ట్ర ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’ అనే విధానంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతున్నాం. ప్రజలకు మేలు చేయడమే మా పని… ప్రచారం చేయాల్సింది మీరే. మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు’’ అని రేవంత్ అన్నారు. -
రాజకీయ ప్రేరేపిత చర్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ ప్రేరేపిత చర్య. 2024 మే 1 వరకు ఎన్డీఎస్ఏ సిఫారసులు ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. రిపోర్టు ఇచ్చిన తర్వాత మరమ్మతులు చేయకపోవడం మరో కుట్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చివేసే కుట్ర చేశాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మౖక్కై ఎన్డీఎస్ఏ నివేదికను ఈడీ, సీబీఐ తరహాలో వాడుతున్నారు..’ అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీఎస్ఏ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ వ్యతిరేకించారని చెప్పారు. గతంలో ఆయన కు ఎన్డీఎస్ఏ తప్పుగా కన్పించిందని, ఇప్పుడు అదే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక..ఆయనకు భగవద్గీతలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. భారత్ సమ్మిట్, రైతు మహోత్సవాలు, ఎన్డీఎస్ఏ తుది నివేదిక పేరిట బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, అయినా కేసీఆర్ గర్జనతో కాంగ్రెస్ కకావికలం అయిందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికను ప్రశ్నిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఎన్డీఎస్ఏ నిర్మించిన పోలవరం డయాఫ్రమ్ వాల్ కుప్పకూలినా నాలుగేళ్లుగా ఎందుకు సందర్శించ లేదు..’ అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నివేదిక తప్పుబట్టింది ‘బీఆర్ఎస్పై విమర్శలు చేయాలనే తొందరపాటులో మంత్రి ఉత్తమ్ కనీసం ఎన్డీఎస్ఏ నివేదికను కూడా అధ్యయనం చేయలేదు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని నివేదికలో చెప్పకున్నా.. బురద చల్లేందుకు ఉత్తమ్ అపసోపాలు పడ్డారు. బ్లాక్ 7ను తిరిగి నిర్మించడం ద్వారా మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావచ్చని ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. లక్ష కోట్లు వృధా అయితే నీళ్లెలా వస్తున్నాయి? మహారాష్ట్రతో అంతర్ రాష్ట ఒప్పందం లేకుండానే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కాంగ్రెస్ నేతలకు కమీషన్లు దోచిపెట్టారు. అనుమతులు తేవడంలో విఫలం కావడం వల్లే సీడబ్ల్యూసీ, వాప్కోస్ సూచన మేరకు నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాం. నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచడం వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నిపుణుల సూచనల మేరకే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల లొకేషన్ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల వృధా జరిగితే నీళ్లు ఎలా వస్తున్నాయి?..’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్‌కు వెంటనే మరమ్మతు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పార్టీ నేత ఎర్రోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సాక్షి: మేడిగడ్డ ప్రాజెక్టు కట్టింది.. కూలిపోయింది.. ఈ విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికగా ఇచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికపై తెలంగాణ సచివాలయంలో మంగళవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారాయన. తెలంగాణ ఆర్టిక వ్యవస్థకు సంబంధించింది బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం బీఆర్ఎస్వాళ్లు తప్పుడు ప్రచారాలు చేశారు. 16 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం.. 38వేల కోట్లతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అనాడు వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రీ ఇంజినీరింగ్, రీ డిజైనింగ్ చేసింది. కమిషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచింది. కమీషన్లకక్కుర్తి కోసం ప్రాణహిత డిజైన్ మార్చింది. చివరకు తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సిన బ్యారేజి...మేడిగడ్డ వద్ద వంద మీటర్ల హైట్ తో కట్టారు. దీని వల్ల ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది. తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. బ్యారేజీల నిర్మాణ సమయంలోనే లోపాలు తెలిసినప్పటికీ సరిదిద్దుకోలేదు. సుందిళ్ల, అన్నారం దగ్గర సాయిల్ టెస్ట్ చేయలేదు. ప్రారంభానికి ముందే లోపాలు బయటపడ్డాయి.. కానీ, బీఆర్ఎస్ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర నష్టం జరిగింది. కాళేశ్వరం డిజైన్లు ఒకలా ఉంటే.. మరోలా నిర్మాణం చేశారు. ప్రాజెక్టు కోసం 85 వేల కోట్లు అంచనా వేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం లోన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలింది. NDSA మేడిగడ్డ పరిశీలనకు వచ్చింది గత ప్రభుత్వం పాలనలోనే. మేడిగడ్డ లో డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని NDSA రిపోర్ట్ గత ప్రభుత్వ హయంలోనే ఇచ్చారు. NDSA అథారిటీ బిల్లుకు పార్లమెంట్లో BRS మద్దతు పలికింది. దేశంలో 5600 బ్యారేజీలు, డ్యామ్‌లను ఎన్డీఎస్ఏ పర్యవేక్షిస్తోంది. దేశంలో ఏ బ్యారేజీకి ఎలాంటి సమస్య వచ్చినా NDSA నుంచే అభిప్రాయం చెప్తుంది. NDSA లో జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. అలాంటిది NDSA నిపుణులను సైతం BRS నాయకులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై లక్షన్నర కోట్ల భారం పడుతోంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు మిత్తి ఏడాదికి 16వేలు కట్టాల్సి వస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌కు లేఖ చేశాం. 14 నెలలు పరిశీలించి నివేదిక రూపొందించింది. గత ప్రభుత్వ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది తుమ్మెడిహట్టి దగ్గర రెండు ప్రాజెక్టులు కడతామన్నారు. తట్టెడు మట్టి కూడా పోయలేదు. పైగా అక్కడ నీటి లభ్యత లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు.. లొకేషన్ పెద్ద మిస్టేక్. అది కూలినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. వాల్స్, భీమ్స్‌లో రంధ్రాలు వచ్చాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఇంతకన్నా సిగ్గు చేటు ఉంటుందా?. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. అనవసర మాటలు మాట్లాడుతున్నారు అని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. కాళేశ్వరాన్ని ఉపయోగించుకునే స్థితి లేదని ఎన్డీఎస్ఏ చెప్పింది. రీడిజైన్ చేసి నిర్మాణం చేయాలని చెప్పింది. రిపోర్ట్ ఆధారంగానే ముందుకు వెళ్తాం ప్రాజెక్టు తప్పిదాలకు కారణమైన అధికారుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయి. అధికారులు తప్పిదాలు చేయడానికి కారణమైన వ్యక్తి గత ప్రభుత్వ పెద్ద కేసీఆర్ . చట్టప్రకారం గత ప్రభుత్వ పాలకులు, అధికారులపై చర్యలు ఉంటాయి. రాబోయే కేబినెట్ భేటీలో NDSA రిపోర్ట్ పై చర్చ జరుపుతాం. క్యాబినేట్ లో చర్చించిన తర్వాత ప్రాజెక్టు పై తదుపరి కార్యాచరణ ప్రకటన చేస్తాం.