ఆ ఫోన్ అచ్చం గెలాక్సీ ఎస్8లా ఉంటుందట! | Will the Google Pixel 2, just like Samsung Galaxy S8, come with Snapdragon 835 SoC? | Sakshi
Sakshi News home page

ఆ ఫోన్ అచ్చం గెలాక్సీ ఎస్8లా ఉంటుందట!

Apr 13 2017 2:14 PM | Updated on Sep 5 2017 8:41 AM

ఆ ఫోన్ అచ్చం గెలాక్సీ ఎస్8లా ఉంటుందట!

ఆ ఫోన్ అచ్చం గెలాక్సీ ఎస్8లా ఉంటుందట!

తాజాగా పిక్సెల్ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చేందుకు గూగుల్ రెడీ అవుతోంది.

నెక్సస్ ఫోన్లకు గుడ్ బై చెప్పి, సొంత బ్రాండులో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి గూగుల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ లో పిక్సెల్ సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అయితే తాజాగా పిక్సెల్ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. పిక్సెల్ 2 పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ అచ్చం శాంసంగ్ ఎస్8, ఎస్8 ప్లస్ లను పోలి ఉంటుందని తెలుస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తోనే ఇది రూపొందుతుందట.
 
వన్ ప్లస్5, షియోమి ఎంఐ6లకు కిల్లర్ గా గూగుల్ దీన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 మాదిరి బెండబుల్ ఓలెడ్ డిస్ప్లేతో గూగుల్ తన తర్వాతి స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తుందని టాక్. వీటి కోసం ఎల్జీ డిస్ ప్లే సంస్థ నుంచి 880 మిలియన్ డాలర్ల ఓలెడ్ డిస్ ప్లేలను కూడా ఆర్డర్ చేసిందట. మరోవైపు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో నిరంతరం ఆపిల్ తో పోటీపడే శాంసంగ్, ఆ కంపెనీకి ఓలెడ్ డిస్ ప్లేల సరుకు రవాణా చేస్తుందని తెలుస్తోంది. ముందస్తు ఫోన్ల కంటే మెరుగైన కెమెరా,  3.5ఎంఎం ఆడియో జాక్, వాటర్ ప్రూఫ్ బాడీ, ప్రీమియం మెటాలిక్ ఫిన్నిస్ తో దీన్ని రూపొందిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement